Webdunia - Bharat's app for daily news and videos

Install App

సత్ ప్రవర్తనతో జైలు నుంచి విడుదలైన కామాధుడు.. మళ్లీ చిన్నారిపై లైంగికదాడి..

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2023 (13:23 IST)
ఓ చిన్నారిపై లైంగిక దాడి కేసులో 12 యేళ్లపాటు జైలుశిక్ష పడిన ఓ కామాంధుడిని సత్ ప్రవర్తన కింద ఏడేళ్లకే జైలు నుంచి విడుదల చేశారు. ఏడేళ్లపాటు జైలుశిక్ష అనుభవించినప్పటికీ అతనిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఈ క్రమంలో జైలు నుంచి విడుదలైన ఆ కామాంధుడు మరో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాత్నా జిల్లాకు చెందిన రాకేశ్ శర్మ ఓ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పదేళ్ళ జైలుశిక్ష పడింది. అయితే, సత్ ప్రవర్తన కారణంగా అతన్ని జైలు అధికారులు ఏడేళ్లకే విడుదల చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన... ఇటీవల మరో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఇంటి బయట ఆడుకుంటున్న ఓ చిన్నారిని మభ్యపెట్టి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆపై అక్కడ బాలికపై దారుణానికి పాల్పడ్డాడు. కామాంధుడి లైంగికదాడితో తీవ్ర రక్తస్రావమైంది. అయినప్పటికీ ఏమాత్రం కనికరం చూపకుండా ఆ బాలికను అక్కడే వదిలివేసి పారిపోయాడు. బాలిక ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటనా స్థలానికి వచ్చి బాలికను ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గేదేలే అన్న అల్లు అర్జున్‌ను తగ్గాల్సిందే అన్నది ఎవరు? స్పెషల్ స్టోరీ

అల్లు అర్జున్ సీఎం అవుతాడు: వేణు స్వామి జోస్యం (Video)

చెర్రీ సినిమాలో నటించలేదు : విజయ్ సేతుపతి

శివకార్తికేయన్, జయం రవి, అథర్వ, శ్రీలీల కలయికలో చిత్రం

ప్రేక్షకుల ఆదరణకు ప్రణయ గోదారి టీమ్ ధన్యవాదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం