Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ హైకోర్టు కీలక తీర్పు... తండ్రి పేరు లేకపోతే పర్లేదు..

Webdunia
సోమవారం, 25 జులై 2022 (19:25 IST)
కేరళ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. యువతులు, మహిళలకు వివాహం కాకుండానే వారికి పుట్టిన పిల్లల విషయంలో... సర్టిఫికెట్లలో తండ్రి పేరు బదులు తల్లి పేరు ఉంచేందుకు అనుమతినిచ్చింది. బర్త్, ఆధార్, స్కూల్, క్యాస్ట్, ఓటర్ కార్డులలో ఆ మేరకు మార్పులు చేయాలని ఆదేశించింది. 
 
అవివాహిత మహిళలు, అత్యాచార బాధిత మహిళలకు జన్మించిన పిల్లలకు దేశంలో అందరిలాగే ప్రాథమిక హక్కులైన గోప్యత, స్వేచ్ఛ, గౌరవంతో కూడిన జీవనం అందించాలని పేర్కొంది. అవివాహిత మహిళకు జన్మించిన ఓ వ్యక్తి ఈ మేరకు కోర్టులో కేసు వేశాడు. 
 
తన సర్టిఫికెట్లలో తండ్రి పేరు మూడు రకాలుగా ఉండడంతో వాటిని తొలగించి కేవలం తల్లి పేరు మాత్రమే ఉండేలా అవకాశం కల్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు. విచారించిన కోర్టు అతనికి అనుకూలంగా తీర్పునిచ్చింది. 
 
తల్లి పేరు నమోదు చేసేలా రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్, బోర్డ్ ఆఫ్ హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్స్, యూఐడీఏఐ, పాస్ పోర్టు తదితర విభాగాలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హన్సిక ఫోటోలు.. చీరలో అదరగొట్టిన దేశముదురు భామ

జానీ మాస్టర్ గురించి భయంకర నిజాలు చెప్పిన డాన్సర్ సతీష్ !

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం

నాగ చైతన్య, సాయి పల్లవి లకు వైజాగ్, శ్రీకాకుళంలో బ్రహ్మరధం

నెట్టింట యాంకర్ స్రవంతి ఫోటోలు వైరల్.. పవన్ కాదు అకీరా పేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments