Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ సెక్స్ రాకెట్, వాట్సాప్‌తో డీల్స్.. ఆ ఇంట్లోకి వెళ్లిన పోలీసులు ఏం చూశారంటే...

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (15:33 IST)
రాత్రి 11 గంటలైంది. ఢిల్లీలోని నోయిడా పోలీసులకు కాల్ వచ్చింది. రిసీవ్ చేసుకున్నారు. అవతలి నుంచి ఓ గంభీరమైన గొంతు ఏదో చెబుతున్నట్లు వినిపిస్తోంది కానీ... ఏంటో అర్థం కావట్లేదు. మళ్లీ చెప్పమంటే కూడా అదే వాయిస్. అదేదో ఆకతాయిల కాల్ అనుకుంటూ... కట్ చేద్దామని డిసైడ్ అవుతుండగా... అవతలి వ్యక్తి నుంచి ఫోన్ మరెవరో తీసుకున్నారు. వారు మాత్రం విషయం కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు.
 
అన్ని వివరాలూ చెప్పేసి... మాకేం సంబంధం లేదు అంటూ కాల్ కట్ చేశారు.
 తమకు వచ్చిన కాల్ నిజమా, అబద్ధమా అనే డౌట్ ఉన్నా... ASU టీమ్ పోలీసులు కారులో బయల్దేరారు. అడ్రెస్ కరెక్టుగా ఉంది. సెక్టార్ 57కి వెళ్లారు. అక్కడో గెస్ట్ హౌస్ ఉంది. బయటికి పెద్దగా కాంతివంతంగా లేదు. బిల్డింగ్ లోపల మాత్రం కాంతి బాగానే ఉంది.
 
పోలీసులు ముందుగానే తమ వాహనాన్ని కాస్త దూరంలో ఆపి.. సీక్రెట్‌గా భవనంలోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ ఓ వ్యక్తి సోఫాలో కూర్చొని... చిప్స్ తింటూ సౌండ్ లేకుండా టీవీ చూస్తూ... "నెక్స్ట్ నేనే... నెక్ట్స్ నేనే"... అనుకుంటుంటే... పోలీస్ ఆఫీసర్ లోపలికి వచ్చి... రైడ్ ఎంటైర్ బిల్డింగ్ అన్నాడు. అంతే... చిప్స్ ప్యాకెట్ జారి కిందపడింది.
 
పోలీసుల రైడ్‌లో ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులూ దొరికారు. వారిని అరెస్టు చేసి... స్టేషన్‌కి తీసుకెళ్లారు. అక్కడ ఎలా చేస్తున్నారని అడిగితే... ఆ ఇద్దరు వ్యక్తులూ... తామే ఇదంతా చేస్తున్నామని ఒప్పుకున్నారు. ముందుగా... కొంతమంది మొబైల్ నంబర్లు తెలుసుకొని... వారి వాట్సాప్‌ నంబర్‌కి అమ్మాయిల ఫొటోలు పంపుతారు. కాల్ గర్ల్స్ కావాలా అని అడుగుతారు.
 
అవతలి వాళ్లు రెస్పాండ్ అయితే... డీల్ మాట్లాడుకుంటారు. ఒక గంటకు రూ.5,000 నుంచి రూ.20,000 దాకా తీసుకుంటున్నారు. ఇందులో అమ్మాయిలకు చెరో రూ.1,500 ఇచ్చి... మిగతా డబ్బును ఇద్దరు నిర్వాహకులూ కాజేస్తున్నారు. ఇలా ప్రతీ డీల్‌కీ జరుగుతోంది. 
ఒకసారి డీల్ కుదిరాక... అమ్మాయిలను ఎక్కడికి తేవాలో అడ్రెస్ అడుగుతారు. విటులు అడ్రెస్ ఇచ్చాక... కారులో అమ్మాయిలను ఆ అడ్రెస్‌కి తీసుకొస్తారు.
 
డీల్ ముగిశాక... తిరిగి కారులో వెళ్లిపోతారు. ఈ బిజినెస్ అంతా వాట్సాప్ ద్వారానే జరుగుతోంది. చెల్లింపులు మాత్రం క్యాష్ లేదా పేటీఎం, గూగుల్ పే లాంటి వాటి ద్వారా చేస్తున్నారు.
 నిందితుల నుంచి కారు, మొబైల్ ఫోన్లు, రూ.24,930 క్యాష్ సీజ్ చేశారు పోలీసులు. అరెస్టైన అమ్మాయిల్లో ఒకరు నేపాల్‌కి చెందిన వారు కాగా... మరొకరు కోల్‌కతాకు చెందిన వారని తెలిసింది. వారు డబ్బు కోసం ఇష్టపూర్వకంగానే ఇదంతా చేస్తున్నారని తెలిసింది. ఈ కేసుపై మరింత దర్యాప్తు చేసి... చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీసీపీ బృందా సుక్లాయ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

Film Chamber: జర్నలిస్టులపై ఆంక్షలు పెట్టేదెవరు? నియంత్రించేదెవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం