Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే జూన్ నుంచి ‘ఒక దేశం-ఒకే రేషన్ కార్డు’

Webdunia
బుధవారం, 4 డిశెంబరు 2019 (06:18 IST)
జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం అర్హులైన లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా ఆహార ధాన్యాలను పొందేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది. దీనికోసం ‘ఒక దేశం-ఒకే రేషన్ కార్డు’ పథకాన్ని 2020 జూన్ 1 నుంచి అమలు చేయబోతోంది.

కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మంగళవారం లోక్‌సభకు తెలిపిన వివరాల ప్రకారం... ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత అర్హులైన లబ్ధిదారులు తమ రేషన్ కార్డును ఉపయోగించి, తమకు అర్హతగల ఆహార ధాన్యాలను దేశంలోని ఏ ప్రాంతంలోని చౌక ధరల దుకాణం నుంచి అయినా పొందవచ్చు.
 
ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళేవారికి ఇబ్బంది లేకుండా ఆహార ధాన్యాలు అందుబాటులో ఉంచడం కోసం ‘ఒక దేశం-ఒకే రేషన్ కార్డు’ పథకాన్ని రూపొందించారు.

ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ ద్వారా లబ్ధిదారు బయోమెట్రిక్/ఆధార్‌ను ధ్రువీకరించిన తర్వాత ఈ పథకం అందుబాటులోకి వస్తుంది. పూర్తి స్థాయిలో ఈపీఓఎస్ పరికరాలు ఉన్న చౌక ధరల దుకాణాల్లో మాత్రమే ఈ పథకం అమలవుతుంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments