Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టు హాలులో కాల్పులు.. మహిళా లాయర్‌కు తీవ్రగాయాలు, ముగ్గురు మృతి

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (16:55 IST)
ఢిల్లీ రోహిణి కోర్టు హల్‌లో జరిగిన 'గ్యాంగ్ వార్' లో మొత్తం నలుగురు మరణించారు. 'మోస్ట్ వాంటెడ్' గ్యాంగ్ స్టర్ జితేంద్ర, అలియాస్ గోగి పై టిల్లు గ్యాంగ్ మనుషులు కాల్పులు జరపగా గోగి అక్కడికక్కడే మృతి చెందాడు. గోగి పై దాడికి పాల్పడిన టిల్లు గ్యాంగ్‌కు చెందిన దుండగులపై ఢిల్లీ 'స్పెషల్ సెల్' సాయుధ పోలీసులు కాల్పులు జరపడంతో వారిలో ముగ్గురు మరణించారు. 
 
శుక్రవారం మధ్యాహ్నం 2.34 గంటలకు కోర్టు నెంబర్ 2 హాలులోనే ఈ కాల్పులు జరిగాయి. న్యాయవాదుల వేషధారణలో ఉన్న టిల్లు గ్యాంగ్‌కు చెందిన దుండగులు ఈ కాల్పులకు పాల్పడ్డారు. ఈ రెండు గ్యాంగుల మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న వైరం ఉంది. గ్యాంగ్ స్టర్ గోగితో సహా దాడికి పాల్పడిన ముగ్గురు మృతి చెందగా. మరో ముగ్గురికి గాయాలు కావడంతో హుటాహటిన ఆసుపత్రికి తరలించారు.
 
ఈ కోర్టు కాల్పుల ఘటనలో మహిళా లాయర్‌కు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. గ్యాంగ్‌స్టర్ జితేందర్‌ను ఓ కేసు విషయంలో పోలీసులు రోహిణి కోర్టుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో లాయర్ దుస్తుల్లో వచ్చిన కొందరు దుండగులు రూమ్ నెంబర్ 207 వద్ద కాల్పులు జరిపారు. పోలీసులు కూడా దుండగులపై ఎదురు కాల్పులు జరిపారని, పోలీసులు, దుండగులు మధ్య జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ఓ మహిళా లాయర్‌కు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ొొొొొొ 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments