Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిలో అల్లుడికి కట్నంగా 21 విషనాగులు.. ఎక్కడో తెలుసా?

Webdunia
శనివారం, 22 జులై 2023 (20:47 IST)
పెళ్ళిలో అల్లుడికి కట్నం బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులను కట్నంగా ఇస్తారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలోని ఒక నిర్దిష్ట సమాజంలో అల్లుడికి విష సర్పాలను కట్నంగా ఇస్తారు.
 
కోర్బా జిల్లా కేంద్రానికి దాదాపు 30 కి.మీ దూరంలో ఉన్న ముకుంద్‌పూర్ గ్రామంలోని సంవర తెగకు చెందిన ప్రజలు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. 
 
ఈ సంఘంలోని ప్రజలు తమ కుమార్తెల వివాహంలో వరుడికి 21 విష సర్పాలను కట్నంగా ఇస్తారు. ఇది జరగకపోతే వివాహం విచ్ఛిన్నమవుతుందని నమ్ముతుంటారు. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా సమాజంలో కొనసాగుతోంది. నిజానికి సంవర తెగ ప్రజలు విషపూరిత పాములను పట్టుకునే పని చేస్తారు. 
 
అలాగే ఆ సర్పాలను చూపిస్తూ ప్రజల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ కారణంగా పెళ్లి సమయంలో అల్లుడికి కట్నంగా విష సర్పాలను ఇస్తారు. 
 
ఈ పాములు చాలా విషపూరితమైనవని, అవి ఎవరినైనా కాటేస్తే, ఆ వ్యక్తి వెంటనే చనిపోతాడని చెబుతారు. సకాలంలో పామును పట్టుకోవడంలో అమ్మాయి తండ్రి విఫలమైతే, సంబంధం తెగిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments