Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తలసేమియా మేజర్‌తో బాధపడుతున్న 13 ఏళ్ల కుమార్తెను రక్షించడానికి ఎముక మజ్జను దానం చేసిన మాతృమూర్తి

Advertiesment
Doctor
, శుక్రవారం, 14 జులై 2023 (17:58 IST)
తలసేమియా మేజర్ - క్లాస్ IIIతో బాధపడుతున్న తన 13 ఏళ్ల కుమార్తెకు ఓ తల్లి హాప్లోయిడెంటికల్ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా బోన్ మ్యారో (ఎముక మజ్జ) ను దానం చేసింది. తలసేమియా మేజర్ అనేది వారసత్వంగా వచ్చే వ్యాధి, ఇందులో ఎర్ర రక్తకణాల జీవితకాలం సాధారణం కంటే చాలా తక్కువగా ఉంటుంది; అందువల్ల వారికి జీవితాంతం ప్రతినెలా రక్తమార్పిడి అవసరం పడుతుంది. తరచుగా రక్తమార్పిడి చేయడం వల్ల హెపటైటిస్, హెచ్‌ఐవి వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లు, ఐరన్ ఓవర్‌లోడ్ కారణంగా అవయవాలు పాడు కావటం జరగవచ్చు. దీనితోపాటు ఎదుగుదలకు సంబంధించిన సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి రావొచ్చు.
 
వైజాగ్‌కు చెందిన రోగి తన 8 నెలల వయస్సు నుండి సాధారణ రక్తమార్పిడి, చీలేషన్ థెరపీలో ఉన్నారు. రోగిని చికిత్స కోసం హైదరాబాద్‌లోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్(AOI)కి చెందిన పీడియాట్రిక్-హెమటో-ఆంకాలజిస్ట్, BMT స్పెషలిస్ట్ డాక్టర్ C.S. రంజిత్ కుమార్‌కు రెఫర్ చేశారు. ఆమెను పరీక్షలు చేసిన తర్వాత, హాప్లోయిడెంటికల్ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం ఆమె తల్లి(32 ఏళ్ల వయస్సు)ని దాతగా సిఫార్సు చేశారు. 
 
అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI) రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ పి మాట్లాడుతూ, “భారత్‌లో BMTని కోరుకునే రోగుల సంఖ్య గత ఐదేళ్లలో పెరిగింది. పీడియాట్రిక్ BMT ఫలితాలను మెరుగుపరచడానికి అత్యంత అనుభవజ్ఞుడైన పీడియాట్రిక్ హేమాటో ఆంకాలజిస్ట్ అవసరం. విస్తృత స్థాయి శిక్షణ, మెరుగైన అనుభవం మరియు అత్యాధునిక సాంకేతికత మద్దతు కలిగిన AOI సంక్లిష్టమైన పీడియాట్రిక్ BMT కేసులకు సైతం చికిత్స అందించే నిపుణుల బృందాన్ని కలిగి ఉంది" అని అన్నారు.  
 
AOI హైదరాబాద్ గత 6 నెలల్లో సుమారు 10 తలసేమియా కేసులను నమోదు చేసింది, వాటిలో 5 క్లాస్ III (7 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) కేసులు ఉన్నాయి. సంక్లిష్టమైన కేసులను నిర్వహించడంలో అనుభవం ఉన్న AOI హైదరాబాద్‌లోని BMT బృందం గత 2 సంవత్సరాలలో 100+ BMT కేసులను నిర్వహించింది, వీటిలో 30+ కేసులు పిల్లల ఎముక మజ్జ మార్పిడికి సంబంధించినవి. 
 
AOI, కన్సల్టెంట్ పీడియాట్రిక్ హేమాటో ఆంకాలజిస్ట్ డాక్టర్ C.S. రంజిత్ కుమార్ మాట్లాడుతూ, “భారతదేశంలో రక్త క్యాన్సర్, తలసేమియా లేదా అప్లాస్టిక్ అనీమియా వంటి ఇతర రక్త సంబంధిత రుగ్మతలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం, తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, అప్లాస్టిక్ అనీమియా, ప్రైమరీ ఇమ్యునో డెఫిషియెన్సీ డిజార్డర్స్‌తో బాధపడుతున్న రోగులకు స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ మాత్రమే ప్రాణాలను కాపాడే చికిత్స. BMT చేయించుకుంటున్న రోగి ఆరోగ్యం గానే వున్నారు, ఎటువంటి రక్తమార్పిడి జరగలేదు" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పువ్వులతో సౌందర్యం.. రోజా, చామంతి, మందారతో ఫేస్‌ ప్యాక్స్