Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెద్దల్లో ఉండే అటోపిక్ డెర్మటైటిస్ చికిత్సలో వినియోగానికి డుపిజెంట్‌కు ఆమోదం

పెద్దల్లో ఉండే అటోపిక్ డెర్మటైటిస్ చికిత్సలో వినియోగానికి డుపిజెంట్‌కు ఆమోదం
, మంగళవారం, 11 జులై 2023 (19:49 IST)
టోపికల్ ప్రిస్క్రిప్షన్ థెరపీలతో తగినంతగా నియంత్రణకు రాని సందర్భాల్లో లేదా ఆ థెరపీలు సూచించేందుకు వీల్లేని సందర్భాల్లో పెద్దల్లో ఒక స్థాయి నుంచి తీవ్ర స్థాయి దాకా ఉంటే అటోపిక్ డెర్మటైటిస్‌ (అలర్జీ సంబంధితాల) చికిత్సలో మొదటి బయోలాజిక్ మెడిసిన్ అయిన డుపిజెంట్ (డుపిలుమాబ్)ను టోపికల్ థెరపీతో పాటుగా లేదా అది లేకుండా వాడేందుకు గాను తాము మార్కెటింగ్ ఆథరైజేషన్ పొందినట్లుగా సనోఫి హెల్త్ కేర్ ఇండియా ప్రై.లి. నేడిక్కడ ప్రకటించింది.
 
అంతర్జాతీయంగా డుపిజెంట్ స్థూలంగా రోగనిరోధక వ్యవస్థను సప్రెసింగ్ చేయడం అని గాకుండా ఈ వ్యాధికి మూలకారణమైన టైప్ 2 ఇన్‌ఫ్లమేషన్‌ను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోగుల చికిత్స తీరుతెన్నులను మార్చివేసింది.
 
అనిల్ రైనా
జనరల్ మేనేజర్, సనోఫి స్పెషాలిటీ కేర్ (ఇండియా)
‘‘భారతదేశంలో అటోపిక్ డెర్మటైటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులకు చికిత్స చేయడానికి మా అత్యుత్తమ థెరపీని అందించే అవకాశం ఉన్నందున, భారతదేశంలో డుపిజెంట్ మార్కెటింగ్ అనుమతిని పొందడం ఒక ముఖ్యమైన మైలురాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్, 60 కంటే ఎక్కువ దేశాల్లో అటోపిక్ డెర్మటైటిస్ కాకుండా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సూచనల కోసం ఆమోదించబడింది. డుపిజెంట్ భారతదేశంలోని మొదటి, ఏకైక బయోలాజిక్ ఔషధం. చికిత్స కష్టంగా ఉండే వ్యాధికి ఇది వ్యాధి సంకేతాలు, లక్షణాలు, జీవన నాణ్యతను గణనీయంగా మెరుగుపరిచింది.’’  
 
అటోపిక్ డెర్మటైటిస్ అనేది తామర యొక్క ఒక రూపం. ఇది దీర్ఘకాలిక టైప్ 2 ఇన్‌ఫ్లమేటరీ వ్యాధి. దీని లక్షణాలు తరచుగా చర్మంపై దద్దుర్లుగా కనిపిస్తాయి. తగ్గుస్థాయి నుండి తీవ్రమైన అటోపిక్ డెర్మటైటిస్ అనేది దద్దుర్లుగా తరచుగా శరీరంలోని చాలా భాగాల్లో కనిపిస్తుంది. తీవ్రమైన, నిరంతర దురద, చర్మం పొడిబారడం, పగుళ్లు, ఎర్రబారడం, క్రస్టింగ్ స్రావాలను కలిగి ఉంటుంది.
 
డాక్టర్ షాలిని మీనన్
కంట్రీ మెడికల్ లీడ్, సనోఫి (ఇండియా)
"భారతదేశంలో పెద్దవారిలో అటోపిక్ డెర్మటైటిస్‌ ప్రాబల్యం 2% నుండి 8% వరకు ఉంటుంది. భారత దేశంలో దీని ప్రాబల్యం ధోరణి పెరుగుతూ ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్స ఎంపికలతో తమ వ్యాధిని నియంత్రించడానికి చాలా మంది తరచుగా సతమతమవుతున్నారు. దురద అనేది రోగులకు అత్యంత కష్టమైన లక్షణాలలో ఒకటి, అది ఆయా వ్యక్తులను పని చేయనీయకుండా చేస్తుంది. తగ్గు స్థాయి నుంచి తీవ్రస్థాయి దాకా అటోపిక్ డెర్మటైటిస్‌తో నివశించే వ్యక్తులు భరించలేని లక్షణాలను అనుభవించవచ్చు. నిద్రలో అంతరాయాలు, పెరిగిన ఆందోళన, నిరాశ లక్షణాలు ఉంటాయి.  అవి జీవన నాణ్యతను గణనీయంగా బలహీనపరుస్తాయి. దీర్ఘకాలికత, తరచుగా కనిపించే గాయాలు గణనీయమైన సామాజిక వెలికి దారితీస్తాయి.  డుపిజెంట్ చర్మాన్ని క్లియర్ చేయడం, నిరంతర బలహీనపరిచే దురదను తగ్గించడం, నిరూపితమైన దీర్ఘకాలిక భద్రతతో పాటు మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని అధ్యయనాల ద్వారా నిరూపించబడింది.
 
ప్రపంచవ్యాప్తంగా 6,00,000 కంటే ఎక్కువమంది రోగులు డుపిజెంట్‌తో చికిత్స పొందుతున్నందున, భారతదేశంలో పెద్దవారికి తగ్గుస్థాయి నుంచి తీవ్రస్థాయి అటోపిక్ డెర్మటైటిస్‌ను నియంత్రించడానికి డుపిజెంట్ త్వరలో ఒక ఎంపికగా అందుబాటులోకి వస్తుంది. అంతర్జాతీయ సహకార ఒప్పందం కింద డుపిలుమాబ్‌ను సనోఫీ, రెజెనెరాన్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రక్తాన్ని శుద్ధి చేసే గోంగూర పచ్చడి..