Webdunia - Bharat's app for daily news and videos

Install App

హికా సైక్లోన్.. తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు..!

Webdunia
గురువారం, 26 సెప్టెంబరు 2019 (16:04 IST)
హికా సైక్లోన్ ప్రభావంతో దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించారు. ఎడతెరపి లేకుండా కురిసే వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బంది తప్పదంటున్నారు. ఈ క్రమంలో యూపీ, రాజస్థాన్, విదర్భ, ఛత్తీస్‌ఘడ్, బెంగాల్‌లో కుంభవృష్టి కురుస్తుందని తెలిపారు. అసోం, మేఘాలయ, మహారాష్ట్ర, గోవాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆలిండియా వార్నింగ్ బులెటిన్‌లో వాతావరణశాఖ తెలిపింది.
 
అంతేగాకుండా.. బీహార్, జార్ఖండ్, బెంగాల్‌లో.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు కూడా పడే అవకాశముందన్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించింది. పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం దూసుకొస్తున్న తుపానును తల్చుకొని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 
 
ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. ఈ నేపథ్యంలో హికా తుపాను దూసుకొస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది, వాగులు పొంగి పొర్లుతుండటంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments