ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 278 మందికి పైగా చనిపోయారు. 900 మందికి పైగా గాయపడ్డారు. చాలామంది తీవ్రంగా గాయపడటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుంది.
ప్రమాదం జరిగిన రైల్వే రూట్‌లో కవచ్ సిస్టమ్ అందుబాటులో లేదని తాజాగా వెల్లడైంది. రైళ్లు ఢీకొనకుండా నియంత్రించే ఈ సిస్టమ్ ఉండుంటే.. ప్రమాదం జరిగేది కాదని అధికారులు అంటున్నారు.
ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) సిస్టమ్‌ను టెక్నాలజీని దాదాపు రూ.400 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం అభివృద్ధి చేసింది. రెండు రైళ్లు ఒకే ట్రాక్‌లో వస్తే.. అవి ఆటోమేటిక్‌గా ఆగిపోయేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. రైలు వేగాన్ని కంట్రోల్ చేస్తుంది.
ప్రస్తుతం ఈ టెక్నాలజీని దశలవారీగా దేశవ్యాప్తంగా అమల్లోకి తెస్తున్నారు. కానీ కవచ్ వ్యవస్థ ఇంకా ఒడిశా రూట్లలో అందుబాటులోకి రాలేదు. అందుకే ఈ ఘోర ప్రమాదాన్ని ఆపలేకపోయింది.