రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఓ విన్నపం చేసింది. ఈ నెల 20, 21వ తేదీల్లో ఏకంగా 17 రైళ్లను రద్దు చేసినట్టు ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు నడిపే రైళ్లు ఇందులో ఉన్నాయి. ఏకంగా 17 రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని రైళ్ల సర్వీసులు ఆలస్యంగా నడువనున్నాయి. ఆయా రైళ్లకు సంబంధించిన వివరాలను దక్షిణ రైల్వే గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.
సికింద్రాబాద్ డివిజన్‌లోని ఘట్‌కేసర్ - చర్లపల్లి స్టషన్ల మధ్య చర్లపల్లి కోచింగ్ టెర్మినల్ నిర్మాణం పనుల్లో భాగంగా, ఆర్‌యూబీ పనుల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేసినట్టు తెలిపింది. అలాగే, మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ రైళ్ల రద్దులో భాగంగా ఆదివారం రద్దు చేసిన రైళ్లను పరిశీలిస్తే,
ఈ నెల 21న (ఆదివారం) వరంగల్ - సికింద్రాబాద్ (రైలు నంబర్ 07757), సికింద్రాబాద్ - వరంగల్ (07462), వరంగల్ - హైదరాబాద్ (07463), హైదరాబాద్ - కాజీపేట (07758), కాచిగూడ - మిర్యాలగూడ (07276), మిర్యాలగూడ - నడికుడి (07277), నడికుడి - మిర్యాలగూడ (07973), మిర్యాలగూడ - కాచిగూడ (07974), సికింద్రాబాద్ - రేపల్లె (17645), గుంటూరు - వికారాబాద్ (12747), వికారాబాద్ - గుంటూరు (12748), హైదరాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ (17011), సిర్పూర్ కాగజ్‌నగర్ - హైదరాబాద్ (17012), సిర్పూర్ కాగజ్‌నగర్ - సికింద్రాబాద్ (17234), సికింద్రాబాద్ - గుంటూరు (17202), గుంటూరు - సికింద్రాబాద్ (17201), సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ (17233) రైళ్లు రద్దయినట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ వెల్లడించారు.