Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ సర్వేలో పన్నీర్ సెల్వందే విజయం.. నటరాజన్ అపోలోలో ఏం చేస్తున్నారు?

జల్లికట్టు వంటి ఉద్యమానికి ఊతమిచ్చిన సోషల్ మీడియా.. తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంకు మద్దతు తెలిపింది. తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగ

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2017 (19:49 IST)
జల్లికట్టు వంటి ఉద్యమానికి ఊతమిచ్చిన సోషల్ మీడియా.. తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంకు మద్దతు తెలిపింది. తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ ఆన్‌లైన్‌ సర్వేలో 95శాతం మంది పన్నీర్‌సెల్వంకే మద్దతు తెలిపారు.

పన్నీర్ సెల్వమే తమిళనాడుకు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగాలని 95శాతం మంది నెటిజన్లు పన్నీర్‌కే తమ ఓటు వేశారు. 'సీఎంవో తమిళనాడు' పర్యవేక్షిస్తున్న ఓ పన్నీర్‌సెల్వం ట్విట్టర్ ఖాతాలో వేదికగా ఈ సర్వేను చేపట్టారు. సుమారు 60వేలమంది ఈ సర్వేలో పాల్గొని తమ అభిప్రాయాన్ని తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. తమిళనాట రాజకీయ సమీకరణాలు గంట గంటకూ మారిపోతున్నాయి. ఇదంతా నడిపించేది.. శశికళ భర్త నటరాజన్ అందరూ భావిస్తారు. ఇంత హడావిడి నడుస్తుంటే నటరాజన్ మాత్రం కనబడట్లేదు. నిజానికి హైడ్రామా మధ్యన అన్నాడీఎంకే శాసనపక్షనేతగా శశికళ ఎన్నికయ్యారు. ఇంకా చెప్పాలంటే ఓవైపు శాసనపక్షనేతగా ఎన్నికైన రోజే ఆమె భర్త నటరాజన్ తీవ్రమైన శ్వాసకోస సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. అమ్మ చికిత్స పొందిన ఆస్పత్రిలోనే నటరాజన్‌ను కూడా చేర్చారని విశ్వసనీయవర్గాల సమాచారం.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments