Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశి క్యాంప్ నుంచి ఎస్కేప్.. పన్నీర్‌ను కౌగిలించుకుని.. ముద్దుపెట్టుకుని.. ఏడ్చేసిన?

తమిళనాడులో రాజకీయ సంక్షోభానికి ఇంకా తెరపడలేదు. గవర్నర్ విద్యాసాగర్ మౌనం వహించడంతో పన్నీర్ సెల్వం శశికళ మధ్య వార్ తారాస్థాయికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో శశికళ వర్గం నుంచి పన్నీర్ క్యాంపుకు చేరుకునే ఎమ్

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (11:10 IST)
తమిళనాడులో రాజకీయ సంక్షోభానికి ఇంకా తెరపడలేదు. గవర్నర్ విద్యాసాగర్ మౌనం వహించడంతో పన్నీర్ సెల్వం శశికళ మధ్య వార్ తారాస్థాయికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో శశికళ వర్గం నుంచి పన్నీర్ క్యాంపుకు చేరుకునే ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. తాజాగా మూడు రోజుల పాటు శశికళ వర్గంలో ఉండి, ఆపై తప్పించుకు వచ్చిన ఎమ్మెల్యే ఒకరు, పన్నీర్ సెల్వం ఇంటికి వచ్చి ఆయన్ను కౌగిలించుకుని, ముద్దు పెట్టి ఏడ్చారు. 
 
తమను బలవంతంగా శశి క్యాంపుకు తీసుకెళ్లారని ఆరోపించారు. శశికళ శిబిరంలోని చాలా మంది ఎమ్మెల్యేలకు అక్కడ ఉండటం ఇష్టం లేదని, తప్పించుకు వచ్చేందుకు మార్గాలను వెదుకుతున్నారని తెలిపారు. వారందరినీ బయటకు తెప్పించాలని కోరారు. కాగా, తనకే సీఎంగా అవకాశం లభిస్తుందన్న నమ్మకంతో ఉన్న పన్నీర్ సెల్వం, సోమవారం ఉదయం నుంచి తనను కలిసేందుకు వస్తున్న సీనియర్ నేతలు, సినీ నటులు, అభిమానులతో మాట్లాడుతూ బిజీగా గడుపుతున్నారు.
 
మరోవైపు గవర్నర్ ఇంకా నిర్ణయాన్ని ప్రకటించక పోవడాన్ని శశికళ వర్గం జీర్ణించుకోలేక పోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సోమవారం సాయంత్రం 4 గంటల వరకూ సమయం ఇచ్చిన శశికళ, ఆపై తన సత్తా చూపిస్తానని హెచ్చరించిన నేపథ్యంలో చెన్నై అంతటా హై అలర్ట్ ప్రకటించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments