Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో సీఎం పోస్ట్ ఖాళీ లేదు.. అక్కడ ప్రభుత్వం ఉంది: వెంకయ్య

తమిళనాడులో ముఖ్యమంత్రి పదవి ఖాళీ లేదని, అక్కడ ముఖ్యమంత్రి అధినేతగా ఉన్న ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. అన్నాడీఎంకేలో ఏర్పడిన సంక్షోభంపై పార్టీ నేతలే ఓ సరియైన నిర్ణయం తీసుకుంటారని కేంద్ర మంత్రి వెంకయ్య

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (10:54 IST)
తమిళనాడులో ముఖ్యమంత్రి పదవి ఖాళీ లేదని, అక్కడ ముఖ్యమంత్రి అధినేతగా ఉన్న ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. అన్నాడీఎంకేలో ఏర్పడిన సంక్షోభంపై పార్టీ నేతలే ఓ సరియైన నిర్ణయం తీసుకుంటారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. తమిళ సంక్షోభాన్ని త్వరగా ముగించేందుకు గవర్నర్ విద్యాసాగర్‌రావు వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ ఓ వైపు నుంచి ఆయనపై ఒత్తిడి నెలకొంటోంది. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ గవర్నర్‌కు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఇప్పటికే ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. 
 
ఈ విషయాలపై స్పందించిన వెంకయ్యనాయుడు ఎలాంటి పక్షపాతం లేకుండా గవర్నర్ వ్యవహరిస్తారని వెంకయ్యనాయుడు చెప్పారు. పన్నీర్ సెల్వం రాజీనామా చేయడానికి బీజేపీ కారణం కాదని స్పష్టీకరించారు. బీజేపీ తమిళ అసెంబ్లీలో ఓ సభ్యురాలు కాదని, తమకు అక్కడ ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి ఎలాంటి అవకాశమూ లేదని చెప్పారు. 
 
తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభంలో బీజేపీ ఎలాంటి జోక్యం చేసుకోదంటూ వెంకయ్య మరోసారి స్పష్టం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ రాజ్యాంగ అధినేతగా తన బాధ్యతలను నిష్ఫక్షపాతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఎలాంటి విషయాలు ఆయన్ని ప్రభావితం చేయడం లేదన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments