Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడుతో అక్రమ బంధం.. నిలబెట్టుకునేందుకు అడ్డదారులు తొక్కిన నర్సు!

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (08:16 IST)
తన ప్రియుడుతో ఏర్పడిన అక్రమ బంధాన్ని నిలబెట్టుకునేందుకు ఓ నర్సు అడ్డదారులు తొక్కింది. తనతో పాటు పనిచేసే సాటి నర్సులు స్నానం చేస్తుండగా, వీడియోలు తీసి తన ప్రియుడుకి పంపించింది. ఆ వీడియోలను చూసిన ఆ ప్రియుడు.. తన స్నేహితులకు షేర్ చేశాడు. అలా ఈ వీడియోల వ్యవహారం బయటకు లీక్ అయ్యాయి. అంతే.. వీడియోలు తీసి స్నేహితుడికి పంపిన నర్సును పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరులో జరిగింది.
 
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగళూరుకు చెందిన అశ్విని అనే నర్సుకు ఓ రాంగ్‌ కాల్‌ ద్వారా తమిళనాడు వేల్లూర్‌కు చెందిన ప్రభు అనే చెఫ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో వారిద్దరూ ఏకాంతంగా పలుమార్లు కలుసుకున్నారు. 
 
అయితే ఆమెకు ఇది వరకే రెండు సార్లు పెళ్లైందని, విడాకులు కూడా తీసుకుందని‍ ప్రభుకు తెలిసింది. దీంతో అతడు ఆమెను దూరం పెట్టసాగాడు. బంధంలో రెండు సార్లు విఫలమైన ఆమె, అతడ్ని వదులుకోవటనానికి ఇష్టపడలేదు. అతడు చెప్పినట్లుగా నడుచుకునేది. 
 
ఆమెకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలు పంపాలని అడిగాడు. ఆమె అలాగే పంపేది. అతడికి అవి బోర్‌ కొడుతున్నాయని చెప్పటంతో హాస్టల్‌ గదిలో తనతో పాటు ఉంటున్న తోటి ఉద్యోగులు స్నానం చేస్తునపుడు తీసిన వీడియోలను అతడికి పంపేది. 
 
ఓ రోజు బాత్‌రూంలో స్నానం చేయటానికి వెళ్లిన ఓ సిబ్బంది అక్కడ కిటికీ దగ్గర సెల్‌ఫోన్‌ ఉండటం గమనించింది. దీనిపై అశ్వినిని ‍ప్రశ్నించగా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించిన అనంతరం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రభును కూడా అదుపులోకి తీసుకున్నారు. అతడు చాలా వరకు నర్సుల బాత్‌రూం వీడియోలను ఆన్‌లైన్‌లో అమ్మినట్లు పోలీసుల విచారణలో తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి: నవ్వొచ్చినా.. ఏడుపొచ్చినా ఆపుకోలేదు..

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments