Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రీయ విద్యాలయాల్లో ఓబీసీలకు ప్రత్యేక కోటా.. ఆర్టీఈ సీట్లలో కోత

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (16:37 IST)
దేశంలోని కేంద్రీయ విద్యాలయ, జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రత్యేక కోటాను అమలు చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం (2020-21) నుంచి కేవీ, జేఎన్‌వీల్లో 27 శాతం ఓబీసీ కోటా రిజర్వేషన్‌ను అమలు చేయనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 1200 విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశానికి ఈ కోటా అమలు కానుంది. 
 
ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ... కేంద్రీయ విద్యాలయ సంగఠన్ (కేవీఎస్)కు లేఖ రాసింది. పాలసీ గురించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. ఓబీసీల సంక్షేమం కోసం ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ గతేడాది డిసెంబర్లో ఇచ్చిన నివేదిక ఆధారంగా కోటాపై నిర్ణయం తీసుకున్నారు.
 
కేవీ అడ్మిషన్ పాలసీ ప్రకారం ప్రస్తుతం ఆర్టీఈ (రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్)కి 25 శాతం, ఎస్‌సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం సీట్లు కేటాయిస్తున్నారు. అలాగే, వికలాంగులకు మూడు శాతం కోటా ఉంది. దీంతో పాటు ఐదు సీట్లను డిఫెన్స్, రైల్వేస్, ప్రభుత్వ రంగం సంస్థలు సిఫారసు చేసిన వారికి ఇస్తున్నారు.
 
మొదటిసారి ఓబీసీ కేటగిరీని చేర్చడంతో పాటు అడ్మిషన్ గైడ్‌లైన్స్‌లో మార్పు చేస్తున్నట్టు కేవీలు, జేఎన్‌వీలకు రాసిన లేఖలో మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి స్కూల్‌ మొదటి తరగతిలో 10 సీట్లు ఆర్టీఈకి, ఆరు సీట్లు ఎస్‌సీలకు, మూడు సీట్లు ఎస్టీలకు, 11 సీట్లు ఓబీసీలకు కేటాయించాలని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments