Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 35శాతం రిజర్వేషన్లు

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2023 (19:07 IST)
విధానసభ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ఒక అటవీ శాఖకు మినహాయింపు ఉంది. ఈ మేరకు మధ్యప్రదేశ్ సివిల్ సర్వీసెస్ రూల్స్, 1997ని సవరించారు. 
 
"సర్వీస్ రూల్స్ ఉన్నప్పటికీ, మేము రాష్ట్ర సేవలో మహిళలకు (అటవీ శాఖ మినహా) అన్ని పోస్టులలో 35 శాతం రిజర్వ్ చేస్తున్నాము" అని నోటిఫికేషన్ పేర్కొంది.
 
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవలే 35 శాతం పోలీసు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు మహిళలకు రిజర్వ్ చేయబడతాయని ప్రకటించారు. అయితే తాజా నోటిఫికేషన్‌లో, ఇది అన్ని ఉద్యోగాలకు వర్తింపజేయబడింది. 
 
అలాగే ‘లాడ్లీ బెహనా యోజన’ పథకం కింద అర్హులైన ప్రతి మహిళకు ఇచ్చే రూ.1,250 శుక్రవారం ఖాతాలో వేస్తామని, ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఇవ్వలేకపోయామని ముఖ్యమంత్రి చెప్పారు.

తెలంగాణ తరహాలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై సంతకం చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments