Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు కొత్త భార్యలు, గది లేదని.. కన్నకూతురిని ఇంట్లో నుంచి గెంటేశాడు..

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (18:46 IST)
సాధారణంగా ఒక్క పెళ్లి చేసుకోవడం గగనమవుతున్న ఈ కాలంలో ఓ వ్యక్తి ఏకంగా ఇద్దరిని పెళ్లాడాడు. ఇందులో ఏమి విశేషం ఉందని అనుకుంటున్నారా? అదే మరి..అప్పటికే అతనికి పెళ్లైన కూతురు ఉంది. ఆమె కూడా తన భర్తతో కలిసి ఇంట్లో నివసిస్తోంది. కాగా కొత్తగా ఇద్దరిని పెళ్లాడిన సదరు వ్యక్తి కూతురుతో పాటు అల్లుడిని ఇంటి నుండి బయటకు గెంటేశాడు. నోయిడాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
56 ఏళ్ల మహమ్మద్ షకీల్ అన్సారీ అనే వ్యక్తి భార్య గత ఫిబ్రవరిలో చనిపోయింది. అతడికి కుమార్తె, అల్లుడు ఉన్నారు. అందరూ కలిసి ఒకే ఇంటిలో ఉంటున్నారు. అయితే భార్య చనిపోయి రెండు నెలలు తిరగకుండానే అన్సారీ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాకుండా సొంత రాష్ట్రమైన బీహార్ వెళ్లిన అన్సారీ అక్కడ కూడా 16 ఏళ్ల వయస్సు గల కన్నెపిల్లను చూసి రెండో పెళ్లి చేసుకుని వచ్చాడు. ఆ బాలికను తీసుకుని ఇంటిలో అడుగుపెట్టడంతో అన్సారీ కూతురికి షాక్ కొట్టినంత పనైంది. 
 
ఇంట్లో తెలియకుండా మరొక పెళ్లి ఎలా చేసుకుంటావని తండ్రిని ప్రశ్నించింది. దీంతో తండ్రి కూతుళ్ల మధ్య గొడవ జరిగింది. పెళ్లాం చనిపోయిన నెల రోజుల్లో రెండో పెళ్లి చేసుకున్న అన్సారీ, మరొక నెలలో మూడో వివాహం చేసుకున్నాడు. ఆమెను కూడా ఇంటిలో ఉంచడానికి ప్రయత్నించాడు. తన ఇద్దరు కొత్త పెళ్లాలకు ఇంటిలో చోటు సరిపోలేదంటూ కూతుర్ని, అల్లుడిని ఇంటి నుండి తరిమేశాడు.
 
కాగా అన్సారీ ఉంటున్న ఇంటిని అందరూ కలిసి నిర్మించుకున్నట్లు అల్లుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఆ స్థలం కొనడానికి తాము రూ.2లక్షలు ఇచ్చామని, ఇల్లు కట్టే సమయంలో రూ.5లక్షలు ఇచ్చామని, అయితే అన్సారీ ఊహించని విధంగా తమను ఇంటి నుండి బయటకు గెంటేశాడని ఆవేదన వ్యక్తం చేసాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments