Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులకు షాకిచ్చిన రైల్వే శాఖ : జూలై వరకు ప్రత్యేక బాదుడే!

Webdunia
ఆదివారం, 21 మార్చి 2021 (09:27 IST)
ప్రయాణికులకు రైల్వే శాఖ తేరుకోలేని షాకిచ్చింది. జూలై నెలాఖరు వరకు ప్రత్యేక రైళ్లను నడిపే ఊసే లేదని పరోక్షంగా చెప్పింది. దీంతో జూలై వరకు స్పెషల్ రైళ్ళ పేరుతో ప్రత్యేక ప్రయాణ రైలు చార్జీల బాదుడు తప్పదని తేలిపోయింది. 
 
ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లలో కొన్నింటిని జూన్ నెలాఖరు వరకు, మరికొన్నింటిని జులై తొలి వారం వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే అప్పటివరకు రెగ్యులర్ రైళ్లు లేనట్టే. ఫలితంగా ప్రయాణికుల నెత్తిన అదనపు చార్జీల మోత తప్పదు.
 
గతేడాది కరోనా లాక్డౌన్ తర్వాత రైళ్ల రాకపోకలను ప్రభుత్వం నిలిపివేసింది. అయితే, ఆ తర్వాత వైరస్ క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ప్రయాణికుల అవసరార్థం గతేడాది చివరి నుంచి పలు జాగ్రత్తలతో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 
 
ఆ తర్వాత వాటిని క్రమంగా పెంచుకుంటూ పోయింది. ప్రస్తుతం 80 శాతానికిపైగా రైళ్లను పునరుద్ధరించినట్టు ఇటీవల రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అయినప్పటికీ ‘ప్రత్యేకం’ అనే ట్యాగ్ తీయకుండా అదనపు చార్జీలతో వీటిని నడిపిస్తున్నారు. 
 
గోదావరి, శబరి, సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లను అవే రూట్లలో, అవే సమయాల్లో నడిపిస్తున్నా వాటిని ప్రత్యేక రైళ్లుగానే పరిగణిస్తూ చార్జీలపై అదనపు వడ్డన వడ్డిస్తున్నారు. రైల్వే తీరుపై ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments