Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ వ్యాప్తంగా లాక్డౌన్ : క్లారిటీ ఇచ్చిన విత్తమంత్రి... ఏమన్నారంటే..

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (14:23 IST)
దేశంలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆదివారం 2.60 లక్షల కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు నైట్ కర్ప్యూలతో పాటు.. పలు ఆంక్షలు విధిస్తున్నయి. ఢిల్లీ ప్రభుత్వం సోమవారం అర్థరాత్రి నుంచి ఆరు రోజుల పాటు లాక్డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మరోమారు లాక్డౌన్ విధించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి.
 
వీటిపై విత్తమంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. సోమవారం ఉదయం పారిశ్రామిక అసోసియేషన్ల ప్రతినిధులతో ఆన్‌లైన్ వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ప్రభుత్వానికి లాక్డౌన్ విధించే ఆలోచన లేదని స్పష్టంచేశారు. కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కరోనా కట్టడి కోసం కేంద్రం పలు దఫాలుగా అధికారులతో సంప్రదించిందని తెలిపారు. 
 
అందరి అభివృద్ధి కోసం, జీవనోపాధి కోసం రాష్ట్రాలతో కలిసి ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. కావున లాక్డౌన్ లాంటి విషయాలపై భయపడాల్సిన అవసరం లేదని.. కేంద్రానికి అలాంటి ఆలోచనే లేదంటూ నిర్మలా.. ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి నిర్మలా సీతారామన్ పారిశ్రామిక అసోసియేషన్ల నుంచి పలు వివరాలను సేకరించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments