ఢిల్లీలో లాక్డౌన్‌ విధించే ప్రసక్తే లేదు... ఆంక్షలు కఠినతరం : అరవింద్ కేజ్రీవాల్

Webdunia
ఆదివారం, 11 ఏప్రియల్ 2021 (09:30 IST)
దేశ రాజ‌ధాని ఢిల్లీలో లాక్డౌన్ విధించ‌బోమ‌ని సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌క‌టించారు. అయితే క‌రోనా మ‌హ‌మ్మారి నివార‌ణ‌కు కొత్త ఆంక్ష‌లు అమ‌లు చేస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో ఏడు నుంచి ప‌ది రోజుల‌కు స‌రిపడా కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంద‌న్నారు. 
 
ఢిల్లీలో ప్ర‌స్తుతం క‌రోనా నాలుగో వేవ్ కొన‌సాగుతుంద‌ని తెలిపారు. త‌మ‌కు త‌గినంత మోతాదులో వ్యాక్సిన్ల‌ను అందించిన‌ట్లు అయితే.. ఎక్కువ సంఖ్య‌లో టీకా కేంద్రాల‌ను ఓపెన్ చేస్తామ‌న్నారు. రెండు, మూడు నెల‌ల్లో వ్యాక్సిన్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేస్తామ‌ని పేర్కొన్నారు. 
 
అదేసమయంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న వేళ, కట్టడి చేసేందుకు మరో మార్గం కనిపించని పరిస్థితుల్లో, ప్రజలపై పలు రకాల నిబంధనలను ఢిల్లీ సర్కారు విధించింది. 
 
ప్రజలు సామూహికంగా పాల్గొనే పలురకాల కార్యక్రమాలను నిషేధించింది. రెస్టారెంట్లు, థియేటర్లు, ప్రజా రవాణా విషయాల్లో పరిమితులతో పాటు వివాహాలు, అంత్యక్రియలు తదితరాలకు హాజరయ్యే వారి సంఖ్యపై అవధులు విధించింది.
 
కొత్త రూల్స్ ఈ నెల 30 నుంచి అమలులోకి వస్తాయి. ఇటీవల అమల్లోకి తెచ్చిన రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ, సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలపై నిషేధాలకు తోడు కొత్త నిబంధనలన్నీ అమలులోకి రానున్నాయి. 
 
వివాహానికి 50 మందిని, అంత్యక్రియలకు 20 మందిని మాత్రమే అనుమతిస్తారు. రెస్టారెంట్లు, థియేటర్లలో మొత్తం కెపాసిటీలో 50 శాతం మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. బస్సులు, మెట్రోల్లకూ ఇదే నిబంధన వర్తిస్తుంది.
 
ఇక జాతీయ, అంతర్జాతీయ పోటీల కోసం ఆటగాళ్లు శిక్షణ తీసుకుంటున్న ఈత కొలనులు మినహా మిగతావన్నీ మూసివేయాలి. స్టేడియంలలో క్రీడల పోటీలకు వీక్షకులను అనుమతించరాదు. 
 
ఇప్పటికే ఢిల్లీ పరిధిలోని కాలేజీలు, పాఠశాలలను ప్రభుత్వం మూసివేసిందన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రేడ్-1 అధికారులు మినహా, మిగతా ఉద్యోగుల్లో సగం మంది మాత్రమే కార్యాలయాలకు హాజరు కావాలి.
 
ఇదేసమయంలో ఆరోగ్య, పోలీసు, హోమ్ గార్డ్, సివిల్ డిఫెన్స్, అగ్నిమాపక, అత్యవసర సేవలు మాత్రం ఎటువంటి ఆటంకాలు లేకుండా అందుతాయని ఢిల్లీ సర్కారు ప్రకటించింది. ప్రైవేటు కంపెనీలు షిఫ్టుల ప్రకారం, ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుని పని చేయాలని, వర్క్ ఫ్రమ్ హోమ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. 
 
మహారాష్ట్ర నుంచి విమానాల్లో ఢిల్లీకి వచ్చే వారు కనీసం మూడు రోజుల ముందు తీసుకున్న ఆర్టీ-పీసీఆర్ నెగటివ్ టెస్ట్ రిపోర్టును తీసుకుని రావాల్సి ఉంటుందని పేర్కొంది. టెస్ట్ రిపోర్టు తీసుకుని రాకుంటే, 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరని, ప్రభుత్వ పనుల నిమిత్తం వచ్చే వారికి మాత్రం అనుమతి ఉంటుందని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments