Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాజ్‌మహల్‌లోని 22 గదుల్లో ఎలాంటి విగ్రహాలు లేవు

Webdunia
శనివారం, 14 మే 2022 (10:25 IST)
తాజ్‌మహల్‌లోని 22 గదులను శాశ్వతంగా మూసేశారని, వాటిలో హిందూ దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయేమో తెలుసుకోవడానికి చర్యలు చేపట్టేలా ఏఎస్‌ఐ ఆదేశించాలని కోరుతూ అలహాబాద్‌లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టేసింది. 
 
ఈ నేపథ్యంలో.. తాజ్‌మహల్‌లోని గదులకు శాశ్వతంగా తాళాలు వేయలేదని, ఆ గదుల్లో ఎలాంటి విగ్రహాలు లేవని భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) అధికారులు తెలిపారు.
 
గదులకు మూడు నెలల కిందటే రిపేర్లు చేశామన్నారు. గోడలపై చిన్నచిన్న పగుళ్లను పూడ్చటంతోపాటు రీప్లాస్టరింగ్‌, కన్జర్వేషన్‌ పనులు జరిగాయని ఏఎస్‌ఐ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. 
 
కాగా... దీనిపై ఏఎస్‌ఐ అధికారులు స్పందించారు. తాజ్‌మహల్‌ బేస్‌మెంట్‌లో ఉన్న గదులను ఇటీవలే తెరిచామని తెలిపారు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న చారిత్రక ఆధారాలను పరిశీలించామని, తాజ్‌మహల్‌ గదుల్లో విగ్రహాలు ఉన్నట్టు ఎక్కడా ప్రస్తావన లేదని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

తర్వాతి కథనం
Show comments