చిదంబరానికి బెయిల్​ వద్దు.. ప్లీజ్: సీబీఐ

Webdunia
శనివారం, 21 సెప్టెంబరు 2019 (09:36 IST)
ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో అరెస్ట్ అయిన కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి బెయిల్​ మంజూరు చెయ్యొద్దంటూ సీబీఐ దిల్లీ హై కోర్టుకు విజ్ఞప్తి చేసింది.

ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో పెద్దఎత్తున అవినీతికి పాల్పడినట్లు తేలిందని పేర్కొంది. ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో తిహార్​ జైల్లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి బెయిల్​ మంజూరు చెయ్యవద్దని దిల్లీ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ). ఈ మేరకు లిఖితపూర్వకంగా కోర్టుకు విన్నవించింది.

ఇప్పటివరకూ తాము జరిపిన దర్యాప్తులో ఆయన పెద్దఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలిందని, అందుకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని సీబీఐ పేర్కొంది.

అవినీతి కార్యకలాపాలతో ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేశారని.. ఒకవేళ చిదంబరానికి బెయిల్ మంజూరు చేస్తే అవినీతి కేసులో తప్పుడు సంప్రదాయానికి న్యాయస్థానం శ్రీకారం చుట్టినట్టు అవుతుందని తెలిపింది. చిదంబరం బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 23న తిరిగి విచారణ జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments