Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌మ‌తాతో పొత్తా... స‌సేమిరా అంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్!

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (16:33 IST)
గోవా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తులపై ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) కీలక ప్రకటన చేసింది. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీతో పొత్తు ఉండదని ప్రకటించింది. సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. మంచి అభ్యర్థులను అందించాలని, నిజాయతీ, అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆప్‌ కృతనిశ్చయంతో ఉందని పార్టీ గోవా ఇన్‌ఛార్జి అతిషి వెల్లడించారు. 
 
 
‘టీఎంసీతో పొత్తు ఉండదు. కాబట్టి వారితో చర్చలు జరిపే ప్రశ్నే లేదు. మంచి అభ్యర్థులతో గోవాకు సరికొత్త ప్రత్యామ్నాయాన్ని అందించాలని, నిజాయతీ, అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నాం' అని ఆమె ఆదివారం ట్వీట్ చేశారు.

 
‘ఆమ్‌ ఆద్మీ పార్టీ గోవాలో టీఎంసీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తోంది. ఈ విషయమై ఇరు పార్టీల మధ్య ఒక రౌండ్‌ చర్చలూ జరిగాయి. కానీ ఈ ప్రతిపాదనపై టీఎంసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు’ అంటూ వచ్చిన ఓ వార్తాకథనాన్ని ఉటంకిస్తూ, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ రచయిత చేసిన ట్వీట్‌పై అతిషీ ఈ విధంగా స్పందించారు. ఇదిలా ఉండగా, అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆప్‌ 2017లోనూ ఇక్కడ పోటీ చేయగా,  ఒక్క సీటు కూడా గెలవలేదు. మరోవైపు గోవాలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని ఇటీవల ప్రకటించిన టీఎంసీ, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీతో పొత్తు పెట్టుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments