Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కంగ‌నా రనౌత్‌కు చుక్కలు-ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ స‌మ‌న్లు జారీ

Advertiesment
కంగ‌నా రనౌత్‌కు చుక్కలు-ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ స‌మ‌న్లు జారీ
, గురువారం, 25 నవంబరు 2021 (18:29 IST)
సిక్కుల‌ను కించ‌ప‌రిచే రీతిలో బాలీవుడ్ నటి కంగ‌నా రనౌత్ కామెంట్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్‌కు చుక్కెదురైంది. కంగనాకు ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ స‌మ‌న్లు జారీ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘ‌వ చ‌ద్దా ప్యానెల్ ముందు డిసెంబ‌ర్ ఆరో తేదీన హాజ‌రుకావాలంటూ ఢిల్లీ అసెంబ్లీ ప్యానల్ ఆదేశించింది. 
 
ఇప్పటికే సిక్కుల‌పై అనుచిత రీతిలో వ్యాఖ్య‌లు చేసిదంటూ కంగ‌నా రనౌత్‌పై ముంబైలో కూడా కేసు నమోదైంది. అయితే ఏడాది కాలంగా రైతులు చేసిన ధ‌ర్నాలను ఖ‌లిస్తానీ ఉద్య‌మంగా అభివ‌ర్ణిస్తూ కంగ‌నా ఆరోప‌ణ‌లు చేసింది. 
 
దీంతో సబ్‌ అర్బన్‌ ఖార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఢిల్లీ సిక్‌ గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ కంగనాపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆమె కావాల‌నే ఆ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు ఎఫ్ఐఆర్‌లో ఆరోపించారు. 
 
సిక్కులను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన షూ కింద దోమల్ని నలిపివేసినట్లు నలిపివేశారని.. అలాంటి వారే దేశానికి కావాలంటూ సోషల్‌ మీడియాలో వ్యాఖ్యానించారు. నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన చేపడుతున్న రైతులను ఖలీస్తానీయులుగా పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్యామ్ సింగ రాయ్.. కృతి శెట్టితో రొమాన్స్‌