Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీతో పొత్తు లేదు.. జేడీయూ ఒంటరిపోరే.. నితీశ్ సంచలన నిర్ణయం

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (08:13 IST)
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగాలని జేడీయూ జాతీయ కమిటీ నిర్ణయించింది. తద్వారా బీజేపీతో కలిసి బీహార్‌ను పాలిస్తున్న జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల విషయంలో సంచలన నిర్ణయం తీసుకునట్లైంది. వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా జేడీయూను బరిలోకి దింపాలని నిర్ణయించారు. 
 
తమ నిర్ణయంతో బీహార్‌లో తమ రెండు పార్టీల మధ్య ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి పేర్కొన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగాలని జేడీయూ జాతీయ కమిటీ నిర్ణయించినట్టు తెలిపారు. యూపీలో జరిగిన గత ఎన్నికల్లో తాము పోటీ చేయకపోవడం వల్ల పార్టీకి నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించినట్టు చెప్పారు.
 
యూపీ.. బీహార్‌తో ముడిపడి ఉన్న రాష్ట్రమని, అక్కడ మా ప్రభుత్వ విధానాలు బాగా ప్రచారం కల్పించబడ్డాయని, ఈ సమయంలో తాము ఒంటరిగానే పోటీ చేయాలని త్యాగి అన్నారు. యూపీలో ఒంటరి పోరు నిర్ణయంపై బీహార్‌లో రాజకీయ పరిణామాలకు సంబంధం లేదని, ఇక్కడ అంత బాగానే ఉందని అన్నారు. ఇదిలా ఉండగా.. అక్టోబర్-నవంబర్ ఎన్నికలు జరిగిన రెండు నెలల కంటే తక్కువ కాలంలో జేడీయూ అరుణాచల్‌ప్రదేశ్‌లో ఆ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే మినహా అందరూ బీజేపీలో చేరారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments