Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటిముందు ఆడుకుంటున్న బాలికపై అత్యాచారం, హత్య.. గ్రామస్థుల ఆందోళన?

పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి.. అత్యంత దారుణంగా చంపిన దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు ఆందోళనలు చేపట్టిన ఘటన నిర్మల్ జిల్లా సోన్ మండలం.. కూచనపల్లి శివారులో చోటుచేసుకుంది.

Webdunia
సోమవారం, 18 జూన్ 2018 (11:05 IST)
పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి.. అత్యంత దారుణంగా చంపిన దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు ఆందోళనలు చేపట్టిన ఘటన నిర్మల్ జిల్లా సోన్ మండలం.. కూచనపల్లి శివారులో చోటుచేసుకుంది. 
 
ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకుపోయి అత్యాచారం చేయడంతో పాటు ప్రాణాలు తీశాడు. ఆపై చిన్నారి మృతదేహాన్ని గోదావరి ఒడ్డున నిర్మాణుష్య ప్రాంతంలో బాలిక మృతదేహాన్ని దాచిపెట్టాడు. బాలిక డెడ్‌ బాడీని కనుగొన్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 
 
అయితే జరిగిన ఘటనపై రక్తం మరిగిన గ్రామస్థులు.. కామాంధులను కఠినంగా శిక్షించాలంటూ ఏకమయ్యారు. 44 వ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. నినాదాలతో హోరెత్తించారు. అంతకుముందు ఊరంతా కలిసి.. పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించింది. స్టేషన్ ముందే కూర్చొని.. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ గ్రామస్థులు చేశారు. అమ్మాయిల రక్షణకు ఎన్నిచట్టాలు తీసుకొస్తున్నా.. వారి ప్రాణాలకు భరోసా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఇటు పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకుని సోన్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఈ కేసులో మరో మైనర్ బాలుడికి కూడా సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. కేసుపై దర్యాప్తును వేగవంతంగా జరుపుతున్నామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments