Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ లాయర్ చేతికే హత్రాస్ కేసు.. శిక్ష ఖాయమన్న సీమా..

Webdunia
శుక్రవారం, 2 అక్టోబరు 2020 (14:55 IST)
2012 డిసెంబర్‌ 16న ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసుతో యావత్ దేశం ఉలిక్కిపడింది. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కేసును వాదించేందుకు లాయర్ సీమా కుష్వాహా ముందుకు వచ్చారు.

ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా చివరకు దోషులకు శిక్షపడేలా చేశారు. దీంతో ఆమె పేరు యావత్ దేశానికి తెలిసింది. ప్రస్తుతం హత్రాస్ ఘటనతో మరోసారి సీమా తెరపైకి వచ్చారు. ఈ కేసులోనూ న్యాయం జరిగేలా చేయాలని పలువురు కోరుతున్నారు.
 
ఎందుకంటే.. నిర్భయ అత్యాచార కేసులో విజయం సాధించి దోషులకు ఉరిశిక్ష పడేలా పోరాటం చేసిన లాయర్ చేతికే హత్రాస్ కేసు కూడా వెళ్లింది.

లాయర్ సీమా కుష్వాహా ఈ కేసును తీసుకుంటానని పేర్కొన్నారు. నిందితులకు కచ్చితంగా శిక్ష పడేలా చూస్తానని వెల్లడించారు. దీని కోసం ఆమె బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు కూడా వెళ్లారు. 
 
అయితే పోలీసులు అడ్డుకోవడంతో కలవలేకపోయారు. అధికారులు తనకు అంతరాయం కలిగిస్తున్నారని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కూడా తాను ఈ కేసును వాదిస్తానని స్పష్టం చేశారు. బాధితురాలి అన్నతో తాను సంప్రదింపులు జరుపుతున్నానని చెప్పారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments