Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫాస్టాగ్‌ను బిగించని వాహనదారుల నుంచి రెట్టింపు టోల్ చార్జీలు : ఎన్‌హెచ్ఏఐ ఆదేశాలు

వరుణ్
శుక్రవారం, 19 జులై 2024 (12:45 IST)
ఉద్దేశపూర్వకంగా విండ్ షీల్డ్‌పై ఫాస్టాగ్‌లను బిగించని వాహనదారుల నుంచి రెట్టింపు టోల్ చార్జీలు వసూలు చేయాలని అన్ని యూజర్ ఫీజు కలెక్షన్ ఎజెన్సీలకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు తాజాగా సంపూర్ణ మార్గదర్శకాలను విడుదల చేసింది. 
 
పలువురు వాహనదారులు ఫాస్టాగ్‌లను వాహనం విండ్ షీల్డ్‌పై బిగించడం లేదు. ఈ తరహా వాహనదారుల కారణంగా టోల్ గేట్ల వద్ద చెల్లింపుల విషయంలో ఇబ్బందులు తలెత్తి, ఇతర వాహనాలకు అంతరాయం ఏర్పడుతుంది. ఇలాంటి వాహనదారులను దారిలో పెట్టడమే లక్ష్యంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సరికొత్తగా సంపూర్ణ మార్గదర్శకాలను విడుదల చేసింది.
 
ఉద్దేశపూర్వకంగా ఫాస్టాగ్‌ను బిగించని వాహనదారుల నుంచి రెట్టింపు టోల్ ఛార్జీలు వసూలు చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. విండ్ స్క్రీన్‌పై ఫాస్టాగ్ బిగించకపోవడంతో టోల్ ప్లాజాల వద్ద అనవసరమైన జాప్యాలు జరుగుతున్నాయని, ఇతర వాహనదారులు అసౌకర్యానికి గురయ్యేందుకు దారితీస్తాయని పేర్కొంది. 
 
ఈ మేరకు రెట్టింపు ఛార్జీలు వసూలు చేయాలంటూ అన్ని యూజర్ ఫీజు కలెక్షన్ ఏజెన్సీలు, రాయితీదారులకు వివరణాత్మక 'ప్రామాణిక నిర్వహణ ప్రక్రియ'ను జారీ చేసింది. దీంతో ఫాస్టాగ్‌లను సరిచేసుకోని వాహనదారులు రెట్టింపు టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
 
విండ్ షీల్డ్ పై ఫాస్టాగ్ లేకుండా టోల్ లేల్‌లోకి ప్రవేశిస్తే విధించే ఛార్జీలపై ఫీజులతో కూడా బోర్డులు ప్రదర్శించాలని స్పష్టం చేసింది. ఇక ఫాస్టాగ్‌లు లేని వాహనాల వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను సీసీటీవీ ఫుటేజీని రికార్డ్ చేయాలని సూచించింది. తద్వారా వాహనాలకు సంబంధించిన రికార్డులను నిర్వహించవచ్చునని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు.. స్పందించిన నటి ప్రణీత

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments