Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీవు కన్యవా? కాదా? శోభనం రాత్రే భార్యకు భర్త వేధింపులు

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (13:47 IST)
శోభనం రోజు రాత్రే ఓ నవవధువుకు అనుమానపు భర్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. నీవు కన్యవా? కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించడంతో ఆ నవ వధువు తల్లడిల్లిపోయింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బసవనగుడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బవనగుడి ప్రాంతానికి చెందిన ఓ యువతితో వివేక్‌ రాజగోపాల్‌ అనే వ్యక్తి వివాహం జరిగింది. ఈ వివాహం ఆర్నెల్ల కిందట జరిగింది. అయితే, వివేక్ రాజగోపాలన్ వివాహమైన తొలి రాత్రిలోనే భార్య ప్రవర్తనపట్ల అనుమానం మొదలైంది. ముఖ్యంగా, నీవు కన్యవా? కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. 
 
పైగా, తమ తల్లిదండ్రుల ఒత్తిడి భరించలేక పెళ్లి చేసుకున్నట్టు, తనను వదిలి వెళ్లిపోవాలని పదేపదే ఒత్తిడి చేయసాగాడు. ఈ వేధింపులు మరింత ఎక్కువ కావడంతో ఆమె భరించలేక పోయింది. దీనికితోడు... భార్యను ఉద్యోగానికి పంపించి, జీతం డబ్బులు తనకు తెచ్చివ్వాలంటూ వేధించాడు. 
 
ఇలా ప్రతి రోజూ నరకం చూపించడంతో ఇక భరించలేనని భావించిన వివాహిత పోలీసులను ఆశ్రయించింది. దీనిపై బనవనగుడి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

Varun Tej: వరుణ్ తేజ్ 15 వ చిత్రం విదేశాల్లో షూటింగ్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments