Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలి: కేంద్ర న్యాయశాఖకు సీజేఐ లేఖ

Webdunia
శనివారం, 26 జూన్ 2021 (19:36 IST)
కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌కు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ లేఖ రాశారు. ఇటీవల అన్ని రాష్ట్రాల హైకోర్టు సీజేలతో నిర్వహించిన రెండు రోజుల సదస్సు, నిర్ణయాలకు సంబంధించిన వివరాలతో ఆయన లేఖ రాశారు.

కరోనా కారణంగా డిజిటల్‌ పద్ధతితో కొనసాగుతున్న కోర్టుల పనితీరు మెరుగుకు నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలని కోరారు. దేశంలో న్యాయస్థానాల సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని సూచించారు.

న్యాయవ్యవస్థలో ఉన్నవారిని ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలన్నారు. కొవిడ్‌ వల్ల నష్టపోయిన న్యాయవాదులు, జూనియర్‌ న్యాయవాదులకు ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.

హైకోర్టుల్లో జడ్జీల ఖాళీలను త్వరితగతిన భర్తీ చేసేందుకు కొలీజియం సిఫారసులపై త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని జస్టిస్‌ ఎన్వీ రమణ లేఖలో విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments