Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్‌లో కీలక పరిణామం... పీసీసీ చీఫ్ పదవికి సిద్దూ రాజీనామా

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (16:08 IST)
పంజాబ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ మంగళవారం రాజీనామా చేశారు. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ బీజేపీలో చేరేందుకు హస్తినకు వెళ్లారన్న వార్తల నేపథ్యంలో సిద్ధూ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. 
 
నిజానికి వచ్చే యేడాది పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో ముఖ్యమంత్రి పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. 
 
తాజాగా పంజాబ్ పీసీసీ చీఫ్ ప‌ద‌వికి న‌వ‌జ్యోత్‌సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న రాజీనామా లేఖ‌ను ఏఐసీసీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీకి పంపించారు. 
 
పంజాబ్‌లో సిద్దూ వర్సెస్ కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్‌గా రాజకీయాలు సాగుతున్నాయి. సిద్దూతో దేశానికి ముప్పు ఉందని, అతనికి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయంటూ ఇటీవల అమరీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. 
 
అదేసమయంలో ఇపుడు ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వచ్చాయి. పైగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో భేటీ అయ్యేందుకు ఢిల్లీకి వెళ్లారన్న వార్తల నేపథ్యంలో సిద్ధూ పీసీసీ చీఫ్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments