Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లాస్ రూంలో విద్యార్థినితో రాసలీలలు... బాలిక గర్భం.. రూ.50 లక్షలు ఆశచూపిన ప్రిన్సిపాల్!

తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు మన పెద్దలు. తమ వద్దకు వచ్చే చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి.. భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ కామాంధ ఉపాధ్యాయుడు.. అభంశుభం తెలియని విద్యార్థినులపై కన్నేశాడు

Webdunia
సోమవారం, 8 మే 2017 (09:39 IST)
తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు మన పెద్దలు. తమ వద్దకు వచ్చే చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి.. భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ కామాంధ ఉపాధ్యాయుడు.. అభంశుభం తెలియని విద్యార్థినులపై కన్నేశాడు. అలా, ఎంతోమంది జీవితాలతో చెలగాటమాటాడు. చివరకు అతనిపాపం పండటంతో ఓ బాలిక గర్భందాల్చింది. దీంతో ఆ ఉపాధ్యాయుడి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
నవీ ముంబై నెరుల్‌లోని మహాత్మాగాంధీ మిషన్ స్కూలు ఉంది. ఇందులో విద్యాభ్యాసం చేసే విద్యార్థినులపై ఆ పాఠశాల ఉపాధ్యాయుడు హరిశంకర్ శుక్లా అనే ప్రబుద్ధుడు కన్నేశాడు. తనకు లొంగిన పలువురు విద్యార్థినిలపై అత్యాచారం చేశాడు. 2016లో స్కూల్లో ఏడో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలిక గర్భందాల్చింది. అప్పటికే ఆమె నాలుగు నెలల గర్భంతో ఉన్నట్టు గుర్తించారు. స్కూలు ఉపాధ్యాయుడు శుక్లా ఏప్రిల్- ఆగస్టు మధ్యలో పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలును ముట్టడించి ఉపాధ్యాయుడిపై చర్యలకు డిమాండ్ చేశారు. 
 
ఇప్పుడా స్కూలు ప్రిన్సిపాల్ బాధిత బాలికల తల్లిదండ్రులకు రూ.50 లక్షలు ఎరగా వేసి కేసును పక్కతోవ పట్టించాలని చూస్తున్నట్టు సమాచారం. అంతేకాదు తనకు పెద్దపెద్ద వారితో సంబంధాలున్నాయని బెదిరింపులకు కూడా దిగుతున్నట్టు సమాచారం. ఈ ఘటనపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) అప్పటి స్కూలు ప్రిన్సిపాల్ సవితా గులాటికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 
 
కాగా, ఉపాధ్యాయుడి వేధింపులు వెలుగులోకి వచ్చాక గత డిసెంబరులో సీబీఎస్‌ఈ బోర్డు ముగ్గురు సభ్యులతో దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఈ సందర్భంగా కమిటీ ఎదుట హాజరైన బాధిత బాలిక తల్లి మాట్లాడుతూ ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత గులాటి తనకు ఫోన్ చేసి పిలిచారని, కేసును విత్ డ్రా చేసుకుంటే రూ.50 లక్షలు ఇస్తానని చెప్పారని కమిటీకి తెలిపారు. అంతేకాక బాలిక అబార్షన్‌కు అయ్యే ఖర్చును భరించడంతోపాటు ఉచితంగా విద్య అందిస్తామని హామీ ఇచ్చారని వివరించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments