Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రైనీ పైలట్ చేతిలో 305 ప్రయాణికుల ప్రాణాలు... ఫ్లైట్‌లో గుర్రుపెట్టి నిద్రపోయిన పైలట్..

పాకిస్థాన్ పాలకులే కాదు.. ఆ దేశానికి చెందిన విమానయాన సంస్థ పైలట్లు కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతారని మరోమారు నిరూపితమైంది. ఏకంగా 305 మంది ప్రయాణికుల ప్రాణాలను ట్రైనీ పైలట్ చేతిలో పెట్టిన ఓ పైలట్..

Webdunia
సోమవారం, 8 మే 2017 (09:28 IST)
పాకిస్థాన్ పాలకులే కాదు.. ఆ దేశానికి చెందిన విమానయాన సంస్థ పైలట్లు కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతారని మరోమారు నిరూపితమైంది. ఏకంగా 305 మంది ప్రయాణికుల ప్రాణాలను ట్రైనీ పైలట్ చేతిలో పెట్టిన ఓ పైలట్.. క్యాబిన్‌లో గుర్రుపెట్టి నిద్రపోయాడు. అలా ఏకంగా రెండున్నర గంటల పాటు నిద్రపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గత నెల 26న పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌ నుంచి లండన్‌కు పాక్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌(పీఐఏ)కు చెందిన ఓ విమానం ఒకటి బయలుదేరింది. ఈ విమానం టేకాఫ్‌ తీసుకున్న కొద్దిసేపటికే పైలట్‌ కెప్టెన్‌ అమీర్‌ అక్తర్‌ హష్మీ.. తన బాధ్యతలను ట్రైనీ పైలట్‌ మహ్మద్‌ అసద్‌ అలీకి అప్పగించాడు. 
 
ఆ తర్వాత ఆయనగారు బిజినెస్‌ క్లాస్‌లోకి వెళ్లి ఏకంగా రెండున్నర గంటలపాటు నిద్రపోయాడు. ఈ దృశ్యాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టాడు. ఘటనపై పీఐఏ అధికారులకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన అధికారులు సదరు పైలట్‌ను విధుల నుంచి తొలగించారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments