Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటికి పిలిచి బ్యూటీషియన్‌పై గ్యాంగ్ రేప్‌!... నిందితుల్లో ఎమ్మెల్సీ కుమారుడు?

హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. ఓ పబ్‌లో పరిచయమైన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ తర్వాత ఇంటికి రప్పించి.. ఓ గదిలో బంధించి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత తన ఇద్దరు స్నేహితులను కూడా ఇంటికి పిలి

Webdunia
సోమవారం, 8 మే 2017 (09:15 IST)
హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. ఓ పబ్‌లో పరిచయమైన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ తర్వాత ఇంటికి రప్పించి.. ఓ గదిలో బంధించి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత తన ఇద్దరు స్నేహితులను కూడా ఇంటికి పిలిచి.. ఆ తర్వాత గ్యాంగ్ రేప్‌కు యత్నించారు. ఈ దారుణానికి పాల్పడిన కామాంధుల్లో ఓ ఎమ్మెల్సీ కుమారుడు కూడా ఉండటం గమనార్హం. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్, బంజారాహిల్స్‌లో బ్యూటీషియన్‌గా పని చేసే 23 యేళ్ల యువతి.. కొంపల్లిలోని ఫాంమెడోస్‌లో నివసించే ప్రీతంరెడ్డి (26)కి ఇటీవల ఓ పబ్‌లో పరిచయమైంది. దీంతో ఆమెను వివాహం చేసుకుంటానని పలుమార్లు సందేశాలు పంపి నమ్మించాడు. ఆ తర్వాత ఆమెతో ఫోన్‌ సంభాషణ మొదలెట్టాడు.
 
ఈ నేపథ్యంలో ఈనెల 5వ తేదీన తన ఇంట్లో ఎవరూలేరని ఇంటికి రావాలని ఆ యువతికి చెప్పాడు. ప్రీతం రెడ్డి మాటలు విన్న ఆ యువతి ఇంటికి వెళ్లగా, ఓ గదిలో బంధించి అత్యాచారం చేశాడు. అనంతరం గదిలో పెట్టి తన ఇరువురు స్నేహితులను తీసుకువచ్చి వారి కోరికను తీర్చాలని బలవంతపెట్టాడు. ముగ్గురు కలిసి యువతిని కారులో ఎక్కించుకుని దుర్భాషలాడుతూ అసభ్యకరంగా ప్రవర్తించారు. తమ తమ పైశాచికానందం తీరిన తర్వాత ఓ చోట దింపి వెళ్లిపోయారు. 
 
అయితే, తన వద్ద డబ్బు లేకపోవడంతో లేకపోవడంతో సమీపంలోని జిమ్‌లోని ఓ యువతి వద్ద రూ.400 తీసుకుని బాధిత యువతి ఆటోలో ఇంటికి వెళ్లింది. అనంతరం జరిగిన ఘటనపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం సాయంత్రం ఫాంమెడోస్‌లోని సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం