అరుణ గ్రహం టూర్‌కు ఆన్‌లైన్ బోర్డింగ్ పాస్‌లు జారీ...

అరుణగ్రహం (మార్స్‌)పైకి లక్ష 30 వేల మంది భారతీయులు అడుగుపెట్టనున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్ బోర్డింగ్ పాస్‌లు వచ్చేశాయి. భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 24 లక్షల మంది మార్స్‌పైకి వెళ్లడానికి సిద్

Webdunia
గురువారం, 9 నవంబరు 2017 (15:36 IST)
అరుణగ్రహం (మార్స్‌)పైకి లక్ష 30 వేల మంది భారతీయులు అడుగుపెట్టనున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్ బోర్డింగ్ పాస్‌లు వచ్చేశాయి. భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 24 లక్షల మంది మార్స్‌పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్లందరికీ ఆన్‌లైన్ బోర్డింగ్ పాస్‌లు కూడా వచ్చేశాయి. 
 
నాసా ఇన్‌సైట్ (ఇంటీరియర్ ఎక్స్‌ప్లోరేషన్ యూజింగ్ సీస్మిక్ ఇన్వెస్టిగేషన్స్, జియోడెసి అండ్ హీట్ ట్రాన్స్‌పోర్ట్) మిషన్ వీళ్లను మార్స్‌పైకి తీసుకెళ్లనుంది. 2018, మే 5వ తేదీన ఈ మిషన్ లాంచ్ కానున్నది. అయితే వీళ్లంతా నేరుగా మార్స్‌పైకి వెళ్లడం లేదు. ఈ 24 లక్షల మంది పేర్లను ఓ చిన్న సిలికాన్ వేఫర్ మైక్రోచిప్‌లో ఇన్‌సర్ట్ చేసి.. ఆ చిప్‌ను ల్యాండర్‌కు అటాచ్ చేయనున్నారు. ఇందుకోసం భారత తరపున లక్షకుపైగా తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు నాసా వెల్లడించింది. 
 
ఈ విషయంలో ప్రపంచంలోనే భారత్ మూడోస్థానంలో నిలవడం విశేషం. తొలిస్థానంలో 6,76,773 మందితో అమెరికా తొలి స్థానంలో ఉండగా.. 2,62,752 మందితో చైనా రెండోస్థానంలో ఉంది. అమెరికా విషయంలో ఎలాంటి సందేహం లేకపోయినా భారత్ నుంచి ఇంత మంది తమ పేర్లు నమోదు చేసుకోవడమే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఇస్రో తమ మంగళ్‌యాన్ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేయడంతో భారతీయుల్లో మార్స్‌పై అవగాహన పెరిగింది. నాసా ఇన్‌సైట్ మిషన్ మొత్తం 720 రోజులు సాగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments