కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి సైతం హాజరయ్యారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, శ్రీనివాస వర్మ, మెగాస్టార్ చిరంజీవి.. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు.
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు బీజేపీ అగ్రనేతలు, తెలుగు రాష్ట్రాల ఎంపీలు, ప్రముఖులు హాజరయ్యారు. అతిథులకు తెలుగు వంటలను సైతం రుచి చూపించేలా పలు వంటకాలను సిద్ధం చేశారు.