Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహా కుంభమేళాకు పోటెత్తిన ప్రజలు.. జన సంద్రంగా త్రివేణి సంగమం!!

Advertiesment
mahakumbhmela

ఠాగూర్

, సోమవారం, 13 జనవరి 2025 (11:26 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభమైంది. ఈ కుంభమేళాకు ప్రజలు పోటెత్తారు. దీంతో గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమ ప్రాంతం జనసంద్రంగా మారిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా ఈ మహా కుంభమేళాను పేర్కొంటారు. ఇది ఘనంగా ఆరంభమైంది. 
 
పుష్య పౌర్ణమి అయిన సోమవారం తెల్లవారుజామునుంచే లక్షలాదిమంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకొని పవిత్ర స్నానాలు చేస్తున్నారు. భక్తుల పూజలతో ఈ ప్రాంతం దేదీప్యమానంగా వెలుగుతోంది. ఉదయం 7.30 గంటల వరకే దాదాపు 35 లక్షల మంది ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరించారని ప్రయాగ్రాజ్ అధికారులు వెల్లడించారు.
 
45 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు, పర్యాటకులు రానున్నారు. మొత్తం 35 కోట్ల మంది వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలతో పాటు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. నదిలో నిరంతరం పహారా కాసేందుకు ప్రత్యేకంగా తేలియాడే పోలీసు స్టేషన్‌ను ఏర్పాటుచేశారు. అటు చిన్నచిన్న పడవలపై భద్రతా సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్నారు.
 
మరోవైపు, కుంభమేళా ప్రారంభంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. "భారతీయ విలువలు, సంస్కృతిని గౌరవించే కోట్లాది మందికి ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభమైంది. విశ్వాసం, భక్తి, సంప్రదాయాల సంగమంతో ఎంతోమందిని ఒకచోట చేర్చింది. మన దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఈ వేడుక ప్రతిబింభిస్తుంది. పవిత్ర స్నానాలు ఆచరించి, భగవంతుడి ఆశీస్సులు తీసుకునేందుకు లెక్కలేనంతమంది రావడం ఎంతో సంతోషంగా ఉంది" అని మోడీ రాసుకొచ్చారు.
 
వెయ్యి ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు జరిగాయని, ఏ సమయంలోనైనా 50 లక్షల మంది నుంచి కోటి మంది ఉండగలిగేలా సౌకర్యాలను కల్పించామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే వెల్లడించారు. భద్రత కోసం 55 పోలీస్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. 45,000 మంది పోలీసులను మోహరించింది. సాధువులకు సంబంధించిన 13 అఖాడాలు కుంభమేళాలో భాగం కానున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Paush Purnima 2025: పౌష్య పౌర్ణమి.. పాయసం నైవేద్యం.. చంద్రునికి ఇలా అర్ఘ్యమిస్తే?