Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌ను ఫన్‌కే ఉపయోగించకండి గురూ.. ఇలాంటి మంచి పనులకు యూజ్ చేసుకోండి

ఫేస్‌బుక్, వాట్సాఫ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాను ఓన్లీ చాటింగ్, షేరింగ్, పోస్టింగ్‌లకు ఉపయోగిస్తున్నారా? కాస్త మారండి వాట్సాప్ గ్రూపును మంచి పనులకు ఎలా ఉపయోగించుకోవాలో ''నమ్మ కోవై'' (మా కోయంబత్తూరు)

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2016 (11:39 IST)
ఫేస్‌బుక్, వాట్సాఫ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాను ఓన్లీ చాటింగ్, షేరింగ్, పోస్టింగ్‌లకు ఉపయోగిస్తున్నారా? కాస్త మారండి వాట్సాప్ గ్రూపును మంచి పనులకు ఎలా ఉపయోగించుకోవాలో ''నమ్మ కోవై'' (మా కోయంబత్తూరు) వాట్సాప్ గ్రూపును చూసి నేర్చుకోండి. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎన్నో మంచి పనులు చేయవచ్చునని, గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించవచ్చునని నిరూపించారు. 
 
కోయంబత్తూరులో రోడ్డుపై వెళుతున్న ఓ వ్యక్తి తన పక్కనుంచే ఓవర్‌ స్పీడ్‌గా వెళుతోన్న ఓ బస్సును గమనించి, వెంటనే బస్సు నెంబర్‌తో సహా ఫోటో తీసి 'నమ్మ కోవై' వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేశాడు. రియాక్షన్ కూడా అంతే వేగంగా వచ్చింది. పోస్ట్‌ చేసిన ఒక గంటలోనే సంబంధిత ట్రాఫిక్‌ పోలీసులు ఆ బస్సును ట్రేస్‌ చేసి, డ్రైవర్ని పట్టుకుని తగిన చర్యలు తీసుకున్నారు. జరిమానా విధించారు.

ఆ జరిమానా విధించిన బిల్లును అదే గ్రూప్‌లో తిరిగి పోస్ట్‌ చేశారు. ఇదో సింపుల్ ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఎన్నో మంచి పనులు ఈ గ్రూపు ద్వారా జరిగిపోతున్నాయి. ఇంకా తమిళనాడు కోయంబత్తూరులో స్థానికంగా ఉన్న సాధారణ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఏర్పాటైన వాట్సాప్‌ గ్రూప్‌ నమ్మ కోవై అనే పేరు కూడా వచ్చేసింది.
 
కిశోర్ అనే వ్యక్తి దీన్ని మొదలుపెట్టాడు. అతడు 'మై సిటీ క్లీన్ సిటీ' అనే ఎన్‌జీవో మేనేజింగ్‌ ట్రస్టీగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో 197 మంది మెంబర్లుగా ఉన్నారు. వాళ్ళల్లో జిల్లా కలెక్టర్‌, కార్పొరేషన్ కమీషనర్‌, ఎస్పీ, డీఎస్పీ, ట్రాఫిక్‌ అధికారులు, నగరంలోని ప్రముఖ ఇండస్ట్రీయలిస్టులు, విద్యాకేంద్రాల వ్యవస్థాపకులు, ఎన్‌జీవో సంస్థల మెంబర్లు ఇలా ఎందరో సభ్యులుగా ఉన్నారు. 
 
ఈ గ్రూప్‌లో ప్రభుత్వ పథకాల గురించిన చర్చలు, నగరంలో ఏర్పడే సమస్యల ప్రస్తావన మాత్రమే ఉంటుంది. సమస్యలను గ్రూపు ద్వారా తెలుసుకున్న సంబంధిత అధికారులు స్పందించి, వెంటనే తగిన చర్యలు తీసుకుంటారు. కేవలం వినోదానికి మాత్రమే వాట్సాప్‌లను యూజ్ చేయకుండా ప్రజా ప్రయోజనాలకు కూడా వాటిని ఉపయోగిస్తే.. గ్రామం కాదు కదా.. దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. మరి మీరు ప్రయత్నించండి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జెనీవాలో అన్నయ్య పెళ్లి.. హాజరైన సమంత.. ఫోటో వైరల్

వరద సహాయార్థం చంద్రబాబు నాయుడుకి 25 లక్షల విరాళం అందజేసిన నందమూరి మోహన్ రూప

హీరో సాయి దుర్గ తేజ్ షెడ్యూల్ కోసం 12 ఎకరాల్లో మ్యాసీవ్ సెట్ నిర్మాణం

విక్టరీ వెంకటేష్ చిత్రం సెట్స్‌లో నటసింహం నందమూరి బాలకృష్ణ

నమ్రత ఘట్టమనేని క్లాప్ తో అశోక్ గల్లా హీరోగా చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వీటితో మధుమేహం అదుపులోకి, ఏంటవి?

డ్రాగన్ ఫ్రూట్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి అమెరికన్ ఆంకాలజీ విజయవంతంగా చికిత్స

పీసీఓఎస్ అవగాహన మాసం: సహజసిద్ధంగా పీసీఓఎస్ నిర్వహణకు చిట్కాలు

యూఎస్ పోలో ఆసన్‌తో కలిసి శ్రీ సవాయి పద్మనాభ్ సింగ్ కలెక్షన్

తర్వాతి కథనం
Show comments