Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగపూర్‌లో 13 మంది భారతీయుల్లో జికా వైరస్‌ లక్షణాలు

ప్రపంచానికి ఇప్పుడు మరో వైరస్‌ భయం పట్టుకుంది. స్వైన్ ఫ్లూ, చికెన్‌గున్యా, బర్డ్‌ఫ్లూ, డెంగ్యూ, ఎబోలా గురించి మరిచిపోకముందే జికా వైరస్‌ ఇప్పుడు అన్ని దేశాలను గడగడలాడిస్తోంది. ఎందరినో చుట్టుముడుతున్నాయ

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2016 (11:24 IST)
ప్రపంచానికి ఇప్పుడు మరో వైరస్‌ భయం పట్టుకుంది. స్వైన్ ఫ్లూ, చికెన్‌గున్యా, బర్డ్‌ఫ్లూ, డెంగ్యూ, ఎబోలా గురించి మరిచిపోకముందే జికా వైరస్‌ ఇప్పుడు అన్ని దేశాలను గడగడలాడిస్తోంది. ఎందరినో చుట్టుముడుతున్నాయి. ఎంతో మంది ఉసురు తీసుకుంటున్నాయి. అయితే ఊరట కలిగించే అంశం ఏమిటంటే... ఇప్పటికింకా భారత్‌లో జికా వైరస్‌కు సంబంధించి ఒక్క కేసూ నమోదు కాలేదు. 
 
ఇప్పటికే అమెరికా, బ్రెజిల్‌ లాంటి దేశాలను గడగడలాడించిన జికా వైరస్‌ ఇప్పుడు సింగపూర్‌ను వణికిస్తోంది. ఇప్పటికే వందల మందికి ఈ జికా వైరస్‌ ఉన్నట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. కాగా జికా సోకినవారిలో 13 మంది భారతీయులు ఉన్నారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. 
 
సింగపూర్‌లో 13 మంది భారతీయులకు జికా వైరస్‌ ఉన్నట్లు తేలిందని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ తెలిపారు. దోమల ద్వారా వ్యాపించే జికాను సింగపూర్‌లో తొలిసారిగా కొంతమంది నిర్మాణ కూలీల్లో గుర్తించారు. 
 
అనంతరం దేశవ్యాప్తంగా 115 మందికి ఈ వైరస్‌ సోకినట్లు తేలింది. ఓ గర్భిణిలోనూ జికా లక్షణాలు కన్పించడంతో ఆమెకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారని అధికారులు తెలిపారు. గర్భిణిలకు ఈ వైరస్‌ సోకితే.. పుట్టే పిల్లలు సాధారణం పరిమాణం కంటే చిన్న తలతో జన్మిస్తారని వైద్యులు అంటున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంటికి తాళం వేసి... అజ్ఞాతంలోకి నటి కస్తూరి - మొబైల్ స్విచాఫ్!!

సరైన భాగస్వామిగా సరైన వ్యక్తిని ఎంచుకోకపోతే జీవితం నరకమే : వరుణ్ తేజ్

కోలీవుడ్‌లో విషాదం - ఢిల్లీ గణేశ్ ఇకలేరు...

సోనీ LIV ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్‌ ట్రైలర్‌ను ఆవిష్కరణ, నవంబర్ 15న ప్రసారం

హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ సికిందర్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments