Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీశాడు.. కోరిక తీర్చాలన్నాడు..

మహిళ స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసి.. ఆమెను బెదిరించిన వ్యక్తిని బాధితురాలి భర్త, స్నేహితులు కొట్టి చంపేశారు. ఈ ఘటన తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నామక్కల్

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2017 (19:28 IST)
మహిళ స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసి.. ఆమెను బెదిరించిన వ్యక్తిని బాధితురాలి భర్త, స్నేహితులు కొట్టి చంపేశారు. ఈ ఘటన తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నామక్కల్ జిల్లా కుమారపాళెంకు చెందిన నాగరాజ్... అదే ప్రాంతానికి చెందిన కామరాజ్ సతీమణి స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీశాడు. ఈ వీడియోను కామరాజ్ భార్య వద్దే చూపించి.. తనతో గడపాలని లేకుంటే ఈ వీడియోను వాట్సాప్‌లో అప్ లోడ్ చేసేస్తానని బెదిరించాడు.
 
దీంతో షాకైన బాధితురాలు.. ఈ విషయాన్ని తన భర్తతో చెప్పింది. తన భార్య స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీయడమే కాకుండా.. దాన్ని చూపి బెదిరించిన నాగరాజ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా నాగరాజ్ ఫోనులో వున్న వీడియోను తొలగించాలని.. మెమరీ కార్డ్ ఇచ్చేయాలని అడిగాడు. కానీ నాగరాజ్ ఇవ్వకపోవడంతో స్నేహితులతో కలిసి అతనితో కామరాజ్ గొడవకు దిగాడు. 
 
ఈ గొడవలో నాగరాజ్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో స్పృహతప్పి కిందపడిపోయిన నాగరాజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై నాగరాజ్ సతీమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కామరాజ్‌తో పాటు అతని స్నేహితులను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments