Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులోని సర్జాపూర్‌లో ముజిగల్ అత్యాధునిక మ్యూజిక్ అకాడమీ ప్రారంభం

Webdunia
బుధవారం, 31 మే 2023 (20:36 IST)
భారతదేశపు అతిపెద్ద మ్యూజిక్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్, ముజిగల్ తమ ఐదవ అత్యాధునిక సంగీత అకాడమీని బెంగళూరులో ప్రారంభించింది. బెంగళూరులోని సర్జాపూర్‌లో ఉన్న అకాడమీ దాదాపు 2700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండటంతో పాటుగా గాత్రం, వాయిద్యంతో సహా సంగీతం నేర్చుకోవడానికి అత్యంత అనుకూలమైనది. దాదాపు 500 మంది విద్యార్థులకు పలు బ్యాచ్‌లుగా బోధన చేసే సౌకర్యాలు కలిగిన ఈ మ్యూజిక్ అకాడమీలో పియానో, కీబోర్డ్, గిటార్, డ్రమ్స్, కర్నాటిక్ వోకల్స్, హిందుస్తానీ వోకల్స్, వెస్ట్రన్ వోకల్స్ లో బోధన చేస్తారు. ఈ మ్యూజిక్ అకాడమీ ప్రారంభం తరువాత, తొలి నెలరోజులూ ఉచితంగా సంగీత విద్యను చేరిన ప్రతి ఒక్కరికీ అందిస్తారు. ఆ తరువాత చేరిన ప్రతి ఒక్కరికీ ఒక నెల పూర్తి ఉచిత సంగీత విద్యను అందించనున్నారు.
 
ముజిగల్ అకాడమీ ప్రారంభం గురించి ముజిగల్ ఫౌండర్ డాక్టర్ లక్ష్మీనారాయణ ఏలూరి మాట్లాడుతూ, "సంగీత విద్యను అందరికీ చేరువ చేయాలనే మహోన్నత లక్ష్యంతో ముజిగల్ అకాడమీ తీర్చిదిద్దాము. అభ్యాసకులకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కేంద్రాన్ని తమకు దగ్గరలో అందిస్తుంది. సంగీతంలో అత్యుత్తమ అభ్యాసం, బోధన అనుభవాలను ఈ కేంద్రం అందించనుంది. భారతీయ శాస్త్రీయ, పాశ్చాత్య సంగీతంలో విస్తృత శ్రేణి కోర్సులను ఇది అందిస్తుంది. ఈ కోర్సులను నిష్ణాతులైన సంగీత అధ్యాపకులు బోధించనున్నారు. వీటితో పాటుగా, అభ్యాసకులను లక్ష్యంగా చేసుకుని ఓ నిర్మాణాత్మక కరిక్యులమ్ (బోధనాంశాలు), పీరియాడిక్ ఎస్సెస్‌మెంట్స్, సర్టిఫికేషన్, సౌకర్యవంతమైన ఫీజు చెల్లింపు ప్లాన్స్, సుశిక్షితులైన అధ్యాపకులను అందుబాటులో ఉంచాము'' అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments