Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అన్ని వయసుల సంగీత ప్రేమికుల కోసం సమ్మర్‌ క్యాంప్‌ను ప్రారంభించిన మ్యుజిగల్‌ మ్యూజిక్‌ అకాడమీ

drums
, మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (23:11 IST)
మ్యూజిగల్‌ మ్యూజిక్‌ అకాడమీ తమ సమ్మర్‌ క్యాంప్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభించినట్లు వెల్లడించింది. సంగీతంలో వినూత్న అభ్యాస అనుభవాలను విద్యార్ధులు పొందే రీతిలో ఈ తరగతులకు రూపకల్పన చేశారు. ఆరు వారాల పాటు జరిగే ఈ సంగీత శిక్షణ కార్యక్రమం ఏప్రిల్‌ మధ్య నుంచి జూన్‌ మొదటి వారం వరకూ జరుగుతుంది. సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ ఈ వేసవి శిబిరంలో పాల్గొనవచ్చు.
 
సంగీత విద్య వినోదాత్మకంగా, అనుసంధానితంగా మరియు ప్రదర్శనాధారితం గా ఉండాలని మ్యూజిగల్‌ అకాడమీ భావిస్తుంది. ఈ సమ్మర్‌ క్యాంప్‌ కార్యక్రమాన్ని విద్యార్థులు సంగీత విద్య పట్ల మరింత ఆసక్తిని కలిగించే రీతిలో తీర్చిదిద్దారు. గతంలో సంగీతం నేర్చుకున్న అనుభవం కలిగిన పెద్దలు తమ కొన్ని ప్రాచుర్యం పొందిన పాటలనూ నేర్చుకోవచ్చు. ఈసమ్మర్‌ క్యాంప్‌ ప్రధానంగా నాలుగు అంశాలు: పియానో, గిటార్‌, డ్రమ్స్‌, వోకల్స్‌పై జరుగుతాయి. ప్రతి సజెక్ట్‌నూ అనుభవజ్ఞులైన నిపుణులు బోధిస్తారు.
 
ఈ కీలక బోధనాంశాలతో పాటుగా విద్యార్ధులకు పనితీరు ఆధారిత మరియు అనుసంధానిత అభ్యాస ప్రక్రియలను సైతం అందిస్తారు. తక్కువ పరిమాణంలో బ్యాచ్‌లను అత్యాధునిక సదుపాయాలలో నిర్వహిస్తారు. కోర్సు పూర్తయిన తరువాత సర్టిఫికేషన్‌, జామ్‌ సెషన్స్‌, గ్రూప్‌ యాక్టివిటీలు సైతం నిర్వహిస్తారు.
 
‘‘ఈ వినూత్న అభ్యాస అనుభవాలను మా విద్యార్ధులకు అందిస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాము. వారి సంగీత నైపుణ్యాన్ని వినోద మరియు అనుసంధానిత వాతావరణంలో  మెరుగుపరుచుకునే అవకాశం దీని ద్వారా అందిస్తున్నాము. మా వేసవి శిబిరం సంగీతంలో ఓనమాలు నేర్చుకునే వారితో పాటుగా కాస్త నైపుణ్యం ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటుంది’’ అని మ్యూజిగల్‌ మ్యూజిక్‌ అకాడమీ ఫౌండర్‌ లక్ష్మీ నారాయణ యేలూరి అన్నారు. ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌ ప్రత్యేక రాయితీ ధరలతో  15 ఏప్రిల్‌ 2023 వరకూ అందుబాటులో ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంఆర్ఎఫ్ టైర్స్, ప్రపంచంలోనే రెండవ అత్యంత పటిష్టమైన టైర్ బ్రాండ్