Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమ నూతన విద్యుత్‌ స్కూటర్‌ సీ 12ను విడుదల చేసిన BGAUSS

Advertiesment
image
, శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (23:51 IST)
BGAUSS ఆటో ప్రైవేట్‌ లిమిటెడ్‌ తమ ప్రతిష్టాత్మక ఈవీ స్కూటర్‌ బీఐ సీ 12 (ఆఎ ఇ12)ను నేడు విడుదల చేసింది. డీ15, బీ8 మరియు ఏ2ల విజయాన్ని సీ 12 అనుసరిస్తుంది. ఇది అత్యంత శక్తివంతంగా ఉండటంతో పాటుగా ఆకర్షణీయంగా, ప్రీమియం స్కూటర్‌ అయినప్పటికీ అత్యంత అందుబాటు ధరలో లభ్యం కానుంది. పూర్తి 100% మేడ్‌ ఇన్‌ ఇండియా విద్యుత్‌ స్కూటర్‌ సీ12, ప్రతి కుటుంబానికీ కాస్త అదనం అనే రీతిలో వస్తుంది. భద్రత మరియు సౌకర్యం కీలక ప్రాధాన్యతలుగా కలిగిన సీ 12 స్కూటర్లు 20కు పైగా భద్రతా ఫీచర్లతో వస్తున్నాయి.
 
సీ 12 విడుదల సందర్భంగా BGAUSS ఆటో ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫౌండర్‌ మరియు మేనేజింగ్‌ డైరెక్టర్‌ హేమంత్‌ కాబ్రా మాట్లాడుతూ, ‘‘ఫేమ్‌ సర్టిఫైడ్‌ వాహనం సీ12ఐ మ్యాక్స్‌. పరిశ్రమలో మొట్టమొదటి తరహా ఫీచర్లు అయినటువంటి బూట్‌ స్పేస్‌ను ఇది కలిగి ఉంది. దీనిలో ఫుల్‌ ఫేస్‌ హెల్మెట్‌ భద్రపరచవచ్చు. కుటుంబానికి అనువుగా పొడవాటి, అత్యంత సౌకర్యవంతమైన సీట్‌ కలిగి ఉండటంతో పాటుగా ఏఆర్‌ఏఐ సర్టిఫికేషన్‌తో సంబంధం లేకుండా 143 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. వాటర్‌ఫ్రూఫ్‌ ఐపీ67 రేటెడ్‌ విద్యుత్‌ మోటర్‌, బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్‌లో 3.2 కిలోవాట్‌ హవర్‌-క్యాన్‌ ఎనేబల్డ్‌ లిథియం-అయాన్‌ బ్యాటరీ ఉంటుంది’’ అని అన్నారు.
 
భారతదేశ వ్యాప్తంగా 100కు పైగా షోరూమ్‌లను BGAUSS కలిగి ఉంది. ఈ బ్రాండ్‌ ఇప్పుడు తమ డీలర్‌నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించడం ద్వారా వినియోగదారులకు మరింత చేరువ కావడానికి ప్రయత్నిస్తుంది. స్మార్ట్‌, సురక్షిత, తెలివైన విద్యుత్‌ స్కూటర్లను అందించడానికి BGAUSS కట్టుబడి ఉంది. ఇది వార్షిక నిర్వహణ మద్దతు, మొబైల్‌ యాప్‌ మద్దతు, రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ వంటివి సైతం అందిస్తుంది. వినియోగదారులు తాజా BG C12 విద్యుత్‌ స్కూటర్‌లను కంపెనీ వెబ్‌సైట్‌ లేదా దగ్గరలోని డీలర్‌షిప్‌ వద్ద బుక్‌ చేసుకోవచ్చు. BG C12 పరిచయ ధర 97,999 రూపాయలు (పరిమిత స్టాక్‌ వరకూ). BG C12 రెగ్యులర్‌ ధర ఫేమ్‌ 2 రాయితీ 48వేల రూపాయలు మినహాయించిన తరువాత 1,04,999 రూపాయలు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్పార్క్‌10 5జీని విడుదల చేసిన టెక్నో; ధర రూ. 12,999