Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగాలాండ్ పౌరులపై ఉద్దేశ్వపూర్వకంగా కాల్పులు!!

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (10:54 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన నాగాలాండ్‌ రాష్ట్రంలోని మోను జిల్లా థిరు, ఒటింగ్ గ్రామాల్లో తీవ్రవాదులుగా భావించి సాధారణ పౌరులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 12 మంది సాధారణ పౌరులు మృత్యువాతపడ్డారు. అలాగే, కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ పౌరులపై భద్రతా బలగాలు ఉద్దేశ్యపూర్వకంగానే కాల్పులు జరిపారంటూ స్థానికులు ఆరోణలు చేస్తున్నారు. 
 
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పూర్తి స్థాయిలో సమగ్రంగా దర్యాప్తు జరిపేందుకు నాగాలాండ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది. ఆ వెంటనే రంగంలోకి దిగిన సిట్ అధికారుల ప్రాథమిక దర్యాప్తులో భద్రతా బలగాలు ఉద్దేశ్యపూర్వకంగానే కాల్పులు జరిపినట్టు వెల్లడైంది. 
 
దీంతో కాల్పులు జరిపిన 15 మంది సైనికులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. వీరిలో ఒకరు చనిపోయిన మేజర్ కూడా ఉన్నారు. స్థానికులను గాయపర్చడం లేదా చంపివేయాలనే కారణంతోనే ఆర్మీ జవాన్లు ఈ కాల్పులకు తెగబడినట్టు సిట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments