Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైంగికవాంఛ తీర్చాలంటూ అన్న ప్రియురాలికి వేధింపులు...

Webdunia
గురువారం, 28 జనవరి 2021 (12:43 IST)
తన అన్న ప్రియురాలిని వేaధించిన కేసులో ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. లైంగిక కోర్కెలు తీర్చాలంటూ వేధించడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన ముంబైలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిలిస్తే, ముంబై, మేఘ్‌వాడి ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువతి, ఓ యువకుడు ప్రేమించుకున్నారు. అయితే, లాక్డౌన్‌ సమయంలో సదరు యువకుడు గుండెపోటుతో చనిపోయాడు. చనిపోయిన వ్యక్తికి ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. అయితే, తన అన్న చనిపోవడంతో అతని ఫోనును తమ్ముడు వాడసాగాడు. 
 
ఈ క్రమంలో అన్న, అన్న ప్రియురాలు కలిసి ఉన్న కొన్ని వీడియోలు అతడి కంటబడ్డాయి. దీంతో వాటిని ఆసరాగా చేసుకుని అన్న ప్రియురాలిపై వేధింపులకు దిగాడు. తన కోర్కెలు తీర్చకపోతే వీడియోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తానంటూ బెదిరించసాగాడు. 
 
అతడి వేధింపులతో విసిగిపోయిన యువతి పోలీసులను ఆశ్రయించింది. యువకుడిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్దనుంచి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం