Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిఫిన్ చేసేందుకు ఇంటికొచ్చి.. కోర్కె తీర్చలేదని స్నేహితుడి భార్యనే కడతేర్చిన పేయింగ్ గెస్ట్..

ముంబైలో దారుణం జరిగింది. టిఫిన్ చేసేందుకు ఇంటికొచ్చిన ఓ యువకుడు... కోర్కె తీర్చలేదని స్నేహితుడి భార్యనే కడతేర్చాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... పాల్ఘార్‌కు చెందిన 23 యేళ్ల హితేష

Webdunia
సోమవారం, 15 మే 2017 (10:22 IST)
ముంబైలో దారుణం జరిగింది. టిఫిన్ చేసేందుకు ఇంటికొచ్చిన ఓ యువకుడు... కోర్కె తీర్చలేదని స్నేహితుడి భార్యనే కడతేర్చాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... పాల్ఘార్‌కు చెందిన 23 యేళ్ల హితేష్ కార్తక్ పాండీ ఉద్యోగ వేటలో దక్షిణ ముంబైలోని కొలబా ప్రాంతానికి వచ్చి అక్కడి ఓ అపార్టుమెంటులో అద్దెకు దిగాడు. అదే అపార్టుమెంట్‌లో శ్వేతా టాండేల్ అనే 28 వివాహిత తన భర్త మహేంద్రతో మొదటి అంతస్తులో నివాసముంటోంది. మహేంద్ర సోదరుడు హితేష్... కార్తక్ పాండీ గదిలో కలిసి నివాసముంటుండటంతో అతనికి వీరి కుటుంబంతో పరిచయం ఏర్పడింది. 
 
అదేసమయంలో హితేష్ పెయిడ్ గెస్ట్‌గా మహేంద్ర ఇంట్లోనే భోజనం చేస్తున్నాడు. ఈ నెల పదో తేదీన మహేంద్ర తన సోదరుడితో కలిసి పనిమీద బయటకు వెళ్లాడు. దీంతో హితేష్ టిఫిన్ చేసేందుకు మహేంద్ర ఇంటికి వచ్చాడు. ఆసమయంలో శ్వేతా ఒక్కటే ఇంట్లో ఉన్నది. దీంతో తన కోర్కె తీర్చాలని బలవంతం చేశాడు. దాన్ని తిరస్కరించిన శ్వేతా.. హితేష్‌తో పెనుగులాడుతూ అరిచేందుకు ప్రయత్నించింది. 
 
దీంతో తన బండారం బయటపడుతుందని హితేష్ వంటగదిలోని కత్తి తీసుకొని శ్వేత గొంతు కోసి చంపాడు. అనంతరం తన గదికి వెళ్లి స్నానం చేసి ఏమీ తెలియనట్లు పనిపై బయటకు వెళ్లాడు. బయటకు వెళ్లి వచ్చిన మహేంద్ర రక్తపు మడుగులో శ్వేత పడి ఉండటం చూసి ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు చెప్పారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి.. హితేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments