Mumbai woman: కన్నతల్లే కుమార్తెను వ్యభిచార కూపంలోకి దించేందుకు ప్రయత్నం

సెల్వి
గురువారం, 27 నవంబరు 2025 (11:27 IST)
ముంబైలో దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. కుమార్తెను కన్నతల్లే వ్యభిచార కూపంలోకి దించేందుకు ప్రయత్నించింది. పక్కింటి వ్యక్తితో కలిసి డబ్బుల కోసం తనను వ్యభిచారం చేయాలని బలవంతం చేస్తున్నారంటూ బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
ఏప్రిల్ నుంచి ఈ రోజు వరకు తన తల్లి, పక్కింటి వ్యక్తి కలిసి వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెస్తున్నారని బాలిక తెలిపారు. తల్లి నుంచి రోజురోజుకు ఒత్తిడి పెరుగుతుండటంతో తన బాధను స్నేహితురాలితో పంచుకుంది. ఆమె ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతో స్కూల్ టీచర్‌కు చెప్పింది.  
 
అంతేకాదు, ఈ వేధింపుల నుంచి తప్పించుకునేందుకు బాలిక ఒకసారి ఇంటి నుంచి పారిపోయి మూడు రోజులపాటు స్నేహితురాలి ఇంట్లో కూడా ఉంది. తిరిగి ఇంటికి వచ్చాక నిందితులు తనను కొట్టి, బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి నెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments