ఖమ్మం జిల్లాలో బాలికపై అఘాయిత్యం జరిగింది. తమ్ముడు కళ్లు తిరిగి కింద పడిపోయాడని మాయమాటలు చెప్పి.. బాలికను ఓ ఇంటి వద్దకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు యువకులు. ఖమ్మం, కొణిజర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక వద్దకు అదే గ్రామానికి చెందిన ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు.
అత్యాచారానికి పాల్పడిన వారిలో ఇద్దరు మైనర్లు వున్నారు. మరొకడు డిగ్రీ చదువుతున్నాడు. చర్చికి వెళ్లి తిరిగి వస్తున్న బాలిక వద్ద ఆమె తమ్ముడు కళ్లు తిరిగి కింద పడిపోయాడని నమ్మించి.. ఒక ఇంటికి తీసుకెళ్లిన నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలిక ఇంటికి చేరుకుంది.
అయినా బాలికపై మళ్లీ అత్యాచారానికి పాల్పడేందుకు ఆ ముగ్గురు ప్రయత్నించారు. కానీ స్థానికులు బాధితురాలి కేకలు విని ఆమెను కాపాడారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మరునాడు బాలిక తన తల్లికి విషయం చెప్పడంతో ఈ దారుణం వెలుగుచూసింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులు ముగ్గురిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో వున్న ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.