Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెన్నెముక విరిగిన పాముకు ఎంఆర్ఐ - సీటీ స్కాన్.. లేడీ డాక్టర్ ట్రీట్మెంట్

సాధారణంగా చిన్నపాటి పాము కంటికి కనిపిస్తేనే బెంబేలెత్తిపోయి ప్రాణభయంతో పరుగులు తీస్తాం. అలాంటిది.. వెన్నెముక విరిగి కదల్లేని స్థితిలో ఉన్న ఓ అరుదైన పాముకు లేడీ డాక్టర్ ఒకరు చికిత్స చేసి ప్రాణంపోశారు.

Webdunia
గురువారం, 20 సెప్టెంబరు 2018 (10:12 IST)
సాధారణంగా చిన్నపాటి పాము కంటికి కనిపిస్తేనే బెంబేలెత్తిపోయి ప్రాణభయంతో పరుగులు తీస్తాం. అలాంటిది.. వెన్నెముక విరిగి కదల్లేని స్థితిలో ఉన్న ఓ అరుదైన పాముకు లేడీ డాక్టర్ ఒకరు చికిత్స చేసి ప్రాణంపోశారు. అదీకూడా ఎంఆర్ఐ, సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేయడమే కాకుండా, మత్తు ఇంజెక్షన్ కూడా వేసిమరీ ట్రీట్మెంట్ చేసిన సంఘటన ముంబై మహానగరంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ముంబై నగరంలోని దహిసర్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి ఆకుపచ్చ రంగున్న అరుదైన పెద్ద పాము కనిపించింది. దీంతో ఆ పాము కాటు వేస్తుందనే భయంతో ఇంటి యజమాని ఆ పామును కర్రతో కొట్టడంతో వెన్నెముక విరిగింది. దీంతో ఆ పాము కదల్లేక ఇంట్లోనే ఉండిపోయింది. 
 
ఆ తర్వాత వైభవ్ పాటిల్ అనే పాముల రక్షకుడుని పిలిచి గాయపడిన పాముకు వైద్య చికిత్స చేయాలని కోరాడు. ఆయన నేరుగా ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ పామును పరిశీలించిన లేడీ డాక్టర్ దీపా కత్యాల్ గాయపడిన పాముకు ఎంఆర్ఐ స్కాన్, సీటీ స్కాన్, ఇతర వైద్య పరీక్షలు చేసి 
ట్రీట్మెంట్ చేసి అరుదైన పామును రక్షించింది. 
 
పాముకు అయిన గాయాన్ని మానేలా డాక్టర్ దీపా కోల్ లేజర్ చికిత్స చేశారు. తీవ్రంగా గాయపడిన పాముకు పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ సైతం ఇచ్చి దాన్ని కాపాడారు. గాయపడిన పాముకు డాక్టర్ చేసిన చికిత్సతో మెల్లగా కోలుకుంటోంది. పాము చికిత్స అనంతరం కొద్దికొద్దిగా కదులుతుందని డాక్టర్ దీపా చెప్పుకొచ్చారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మూగజీవి ప్రాణాలు కాపాడిన వైద్యురాలిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments